Share News

మరణానికి చేరువలో తండ్రి.. కొడుకుకి జీవిత పాఠాలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:32 PM

క్యాన్సర్‌తో పోరాడుతూ.. మరణానికి చేరువలో ఉన్న ఓ వ్యక్తి.. తన కుమారుడికి జాగ్రత్తలు చెబుతున్నాడు. ఆ వీడియో అందరిని కంటతడి పెట్టిస్తుంది.

మరణానికి చేరువలో తండ్రి.. కొడుకుకి జీవిత పాఠాలు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: బిడ్డకు కన్న తండ్రి నీడలా ఉంటాడు. కానీ ఆ నీడ శాశ్వతంగా దూరమైతే.. దానిని భరించడం చాలా కష్టం. పసి వయస్సులో తండ్రి విలువ అంతగా తెలియదు. కానీ వయస్సు పెరిగే కొద్దీ.. ఆయన విలువ తెలుస్తుంది. మనకు తెలియని పరాయి స్త్రీని కూడా అమ్మ అని పిలవగలం. కానీ కన్న తండ్రిని మాత్రమే నాన్నా అని పిలవగలం. ఆ తండ్రే శాశ్వతంగా దూరమైతే.. ఆ పిలుపు అక్కడితో ఆగిపోతుంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఓ తండ్రి.. తన కుమారుడైన పసివాడి (పేరు మంత్ర)కి జాగ్రత్తలు చెబుతున్నాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తే ఎవరి గుండె అయినా భారంతో బరువెక్కుతోంది. క్యాన్సర్ చివరి స్టేజ్‌లో ఉండి.. శ్వాస తీసుకోవడం ఆ తండ్రికి కష్టంగా మారింది. ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు తన కుమారుడు ‘మంత్ర’తో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.


ఈ వీడియోలో.. మంచంపై కూర్చున్న ఓ తండ్రి, తన కుమారుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఇకపై అల్లరి పనులు చేయవద్దని సూచిస్తున్నాడు. అమ్మా మాట వినాలని చెబుతున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నాడు. తాను వెళ్లిపోయిన తర్వాత ఏడవ కూడదని స్పష్టం చేశారు. నాన్న ఎక్కడికి వెళ్లాడని ఎవరినీ ఆడగకూడదని నిబంధన విధించాడు.


ఈ విషయాన్ని గుర్తుంచుకో.. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా స్మరించుకున్నప్పుడుల్లా.. నా ఆత్మ ఎల్లప్పుడూ నీతోనే ఉంటుందని ఆ పసివాడికి స్పష్టం చేశాడు. ఆ తండ్రి చెబుతున్న మాటలను ఆ పసివాడు వింటూ.. అలాగే అంటూ అమాయకంగా తల ఊపుతున్నాడు. అదే సమయంలో ఆ తండ్రి కళ్లలో నుంచి వచ్చిన నీటిని చేతితో తుడుచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది లైక్ కొట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నడి రోడ్డుపై బైక్‌‌తో స్టంట్.. పల్టీ కొట్టిన రైడర్! వీడియో వైరల్

వృద్ధాశ్రమంలో దారుణం.. వృద్ధ మహిళలపై 14 ఏళ్ల బాలుడి దాడి

For more Viral News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 07:00 PM