Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 15 , 2026 | 06:48 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Feb 15, 2026 22:20 IST

    పాకిస్థాన్ ఆలౌట్.. భారత్ ఘన విజయం

    • 176 పరుగుల ఛేదనలో తీవ్రంగా విఫలమైన పాకిస్థాన్

    • 18 ఓవర్లలో 114 పరుగులకు పాక్ ఆలౌట్

    • 61 పరుగుల తేడాతో పాక్‌పై టీమిండియా ఘన విజయం

    • హార్దిక్ పాండ్య, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలకు తలో 2 వికెట్లు

    • కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మలకు చెరొక వికెట్

  • Feb 15, 2026 21:33 IST

    మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్‌..

    • హైదరాబాద్‌: మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్‌..

    • మేయర్‌, చైర్మన్ల ఎన్నికపై రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం..

    • హాజరైన TPCC చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు..

    • హంగ్‌ వచ్చిన చోట అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశం..

  • Feb 15, 2026 20:59 IST

    పరిగి డీఎస్పీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత..

    • వికారాబాద్‌: పరిగి డీఎస్పీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత..

    • డీఎస్పీ ఆఫీస్‌ ఎదుట నస్కల్ గ్రామస్తులు బైఠాయింపు..

    • 1వ వార్డు మెంబర్‌ అక్కమ్మ కనిపించడం లేదని ఆందోళన..

    • ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యుల ఆగ్రహం..

  • Feb 15, 2026 20:34 IST

    కాంగ్రెస్ గూటికి.. ఇద్దరు AIFB కార్పొరేటర్లు..

    • కరీంనగర్‌: కాంగ్రెస్ గూటికి.. ఇద్దరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కార్పొరేటర్లు..

    • మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం సమక్షంలో పార్టీలో చేరిన కార్పొరేటర్లు..

    • కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన నలుగురు MIM కార్పొరేటర్లు..

  • Feb 15, 2026 20:09 IST

    రేపు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

    • అమరావతిలో రేపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌ గేట్స్‌..

    • RTGS కేంద్రాన్ని సందర్శించనున్న బిల్‌ గేట్స్‌..

  • Feb 15, 2026 20:06 IST

    బంగ్లాదేశ్‌ ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమానికి.. స్పీకర్ ఓం బిర్లా..

    • బంగ్లాదేశ్‌ నూతన ప్రధాని రెహ్మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం..

    • భారత్ తరఫున హాజరుకానున్న స్పీకర్ ఓం బిర్లా..

    • ఎల్లుండి ఢాకాలో నూతన ప్రధాని రెహ్మాన్ ప్రమాణ స్వీకారం..

  • Feb 15, 2026 18:42 IST

    ఆన్‌లైన్‌ బెట్టింగ్ గేమ్‌.. గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

    • మహబూబాబాద్ : డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో విషాదం..

    • ఆన్‌లైన్‌ బెట్టింగ్ గేమ్ ఆడిన సాయికుమార్.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం..

    • రూ.95 వేలు పోగొట్టుకున్న యువకుడు.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం..

    • ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతి..

  • Feb 15, 2026 17:59 IST

    పార్టీ మార్పుపై వీడియో విడుదల చేసిన కౌన్సిలర్లు

    • కామారెడ్డి: పార్టీ మార్పుపై వీడియో విడుదల చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

    • ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేసిన కౌన్సిలర్లు..

    • మరో పార్టీలో చేరామనే వార్తలు అవాస్తవం..

    • పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: బీఆర్ఎస్ కౌన్సిలర్లు

  • Feb 15, 2026 17:26 IST

    బైకును ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు..

    • కృష్ణా జిల్లా: పామర్రు మండలం జుఝూవరం వద్ద రోడ్డు ప్రమాదం..

    • విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై..

    • ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు ఢీకొట్టి రోడ్డుపై పల్టీ కొట్టిన కారు..

    • బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు, వారి కుమారుడికి గాయాలు..

  • Feb 15, 2026 17:19 IST

    రేపటి నుంచి భారత్ వేదికగా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌

    • ఢిల్లీ: భారత్‌ మండపం, సుష్మా స్వరాజ్‌ భవన్‌, అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహణ..

    • AI సమ్మిట్‌కు హాజరుకానున్న 20 దేశాల అధినేతలు..

    • AI సమ్మిట్‌కు హాజరుకానున్న 40 కంపెనీ CEOలు..

    పూర్తి కథనం..

  • Feb 15, 2026 16:49 IST

    జగిత్యాల ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్..

    • సంజయ్‌కుమార్, జీవన్‌రెడ్డితో మాట్లాడిన AICC సెక్రటరీ సవాంగ్..

    • పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇద్దరికీ చెప్పిన నేతలు..

    • పార్టీ జెండా మోసినవారికి చైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం..

    పూర్తి కథనం..

  • Feb 15, 2026 16:33 IST

    మంచిర్యాలలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్..

    • మంచిర్యాల కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌కు మరో షాక్..

    • కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ అమృత రాజ్ కుమార్..

    • మొత్తం 60 కార్పొరేటర్లకు గాను.. 49కి చేరిన కాంగ్రెస్ బలం..

  • Feb 15, 2026 15:55 IST

    విశాఖలోని గంగవరం పోర్ట్ వై జంక్షన్‌పై స్థానికుల ఆందోళన..

    • విశాఖ: గాజువాక పరిధి గంగవరం పోర్ట్ వై జంక్షన్‌పై స్థానికుల ఆందోళన..

    • భారీ వాహనాలు అటుగా రాకూడదని ధర్నాకు దిగిన స్థానికులు..

    • వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించిన మహిళలు..

    • ధర్నా కారణంగా భారీగా నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్‌కి అంతరాయం..

  • Feb 15, 2026 15:48 IST

    10.32 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్..

    • హైదరాబాద్: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన అఫ్జల్‌గంజ్ పోలీసులు..

    • నిందితుల వద్ద నుంచి 10.32 కిలోల గంజాయి స్వాధీనం..

    • కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్న ఆశిష్ శిక్ధర్, భీమా జాలి..

    • రెండు ఫోన్లు, రూ.2,380 నగదు స్వాధీనం..

    • పరారీలో ఉన్న నిందితరాలు మౌని కోసం గాలిస్తున్న పోలీసులు..

  • Feb 15, 2026 15:27 IST

    పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

    • ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్‌-2026లో భాగంగా..

    • భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్ల మధ్య మ్యాచ్..

    • టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 93 పరుగులకే ఆలౌటైన పాక్..

    పూర్తి కథనం..

  • Feb 15, 2026 15:12 IST

    ధర్మ పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: పవన్ కళ్యాణ్

    • ధర్మ పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    • ఆలయాల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పని చేస్తున్నాం..

    • 41 ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివరాత్రి వేడుకలు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    పూర్తి కథనం..

  • Feb 15, 2026 14:54 IST

    నేపాల్‌పై వెస్టిండీస్ ఘన విజయం..

    • టీ20 వరల్డ్‌కప్‌: నేపాల్‌పై వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం..

    • స్కోర్లు: నేపాల్‌ 133/8, వెస్టిండీస్‌ 134/1 (15.2 ఓవర్లు)..

    పూర్తి కథనం..

  • Feb 15, 2026 14:53 IST

    యాగంటి స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

    • నంద్యాల: యాగంటి ఉమామహేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ..

    • ఏపీ ప్రభుత్వం, TTD తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి..

  • Feb 15, 2026 14:51 IST

    మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కన్నుమూత

    • విజయవాడ: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఐలాపురం వెంకయ్య కన్నుమూత..

    • ఐలాపురం వెంకయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు సానుభూతి..

    • బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య కృషి: చంద్రబాబు

  • Feb 15, 2026 14:00 IST

    సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు

    • బంజారా భవన్‌లో సంత్‌ శ్రీ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు

    • పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి లక్ష్మణ్‌

  • Feb 15, 2026 13:40 IST

    మారుతున్న గద్వాల మున్సిపల్ రాజకీయాలు

    • 19 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ క్యాంప్

    • 18 మంది కౌన్సిలర్లతో బీఆర్ఎస్, బీజేపీ శిబిరం

    • ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

    • మరో ముగ్గురు, నలుగురు కౌన్సిలర్ల మద్దతు పెరుగుతుందని బీఆర్ఎస్ ధీమా

  • Feb 15, 2026 13:38 IST

    బీఆర్ఎస్‌కు షాక్..

    • మంచిర్యాల కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ముగ్గురు కార్పొరేటర్లు..

    • ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక..

    • మొత్తం 60 కార్పొరేటర్ స్థానాల్లో 47కి చేరిన కాంగ్రెస్ బలం..

  • Feb 15, 2026 12:11 IST

    జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం

    • జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కల్యాణ్‌

    • సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • Feb 15, 2026 11:21 IST

    తూ.గో.: దేవరపల్లి మండలం కొత్తగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

    • రాంగ్ రూట్‌లో వెళ్తూ బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ద్విచక్రవాహనం

    • బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి, మరో మహిళ అక్కడికక్కడే మృతి

    • బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పగాయాలు

    • మృతులు దేవరపల్లి మండలం సుబ్బరాయపురం వాసులుగా గుర్తింపు

  • Feb 15, 2026 11:18 IST

    నిజామాబాద్ కార్పొరేషన్‌ మేయర్ పీఠంపై కాంగ్రెస్ పట్టు

    • MIMతో కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకోనున్న కాంగ్రెస్

    • MIMకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనున్న కాంగ్రెస్‌

    • కాంగ్రెస్ శిబిరానికి చేరిన BRS కార్పొరేటర్ విజయలక్ష్మి

    • ఎక్స్‌అఫీషియో ఓట్లతో 34కు చేరిన కాంగ్రెస్‌ బలం

  • Feb 15, 2026 10:51 IST

    అమెరికాలోని శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో దారుణం

    • హిందూ విద్యార్థి అనుకుని ఇటీవల సిక్కు విద్యార్థిపై దాడి

    • ఫిబ్రవరి 7న బాధితుడిని హిందువుగా భావించి దాడి

    • తాజాగా వెలుగులోకి వచ్చిన దాడి ఘటన

    • దాడిని ఖండిస్తున్న అమెరికాలోని హిందూ సంస్థలు

    పూర్తి కథనం

  • Feb 15, 2026 10:45 IST

    ఆదిలాబాద్‌లో మారుతున్న మున్సిపల్ రాజకీయాలు

    • BRS, MIM, ఇండిపెండెంట్లతో కలిసి పీఠం దక్కించుకుంటామన్న కాంగ్రెస్‌

    • ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ

    • మ్యాజిక్‌ ఫిగర్‌ 26, MP, MLA, ఎక్స్‌అఫీషియోతో 23కు చేరిన BJP బలం

    • స్వతంత్రుల మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు

  • Feb 15, 2026 10:42 IST

    కరీంనగర్ మేయర్ పీఠం మాదే: ABNతో మంత్రి పొన్నం

    • బండి సంజయ్ గెలిస్తే ఒకటి.. మేం గెలిస్తే మరోటా: పొన్నం

    • రాజకీయ పార్టీగా మాకు హక్కు ఉంటుంది : పొన్నం

    • 13 స్థానాలు ఉన్నప్పుడే మేయర్ పీఠం సాధించాం: పొన్నం ప్రభాకర్‌

    • బీజేపీకి కావాల్సినంత సంఖ్యా బలం లేదు: ABNతో మంత్రి పొన్నం

    • కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేదు: పొన్నం ప్రభాకర్‌

  • Feb 15, 2026 10:41 IST

    కరీంనగర్ కార్పొరేషన్‌లో మారుతున్న సమీకరణాలు

    • కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ

    • ఇండిపెండెంట్లు, ఎక్స్‌అఫీషియోతో 35కు చేరిన BJP బలం

    • సంఖ్యా బలం మాకే ఉందంటున్న కాంగ్రెస్‌ నేతలు

    • హైదరాబాద్‌ కేంద్రంగా క్యాంప్‌ రాజకీయాలు

    • మేయర్ సీటు బాధ్యత ఇద్దరు మంత్రులకు అప్పగించిన సీఎం రేవంత్‌

    • కరీంనగర్‌లోనే మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌

  • Feb 15, 2026 09:32 IST

    ప్రధాని మోదీకి ఆహ్వానం..

    • బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్‌పీ

    • త్వరలో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న తారిక్ రహ్మాన్

    • ఫిబ్రవరి 17న జరిగే కార్యక్రమానికి భారత ప్రధాని మోదీకి ఆహ్వానం

    పూర్తి కథనం

  • Feb 15, 2026 09:04 IST

    మహా శివరాత్రి సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

    • శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువైన పవిత్ర భూమి ఏపీలోనే ఉంది: సీఎం చంద్రబాబు

    • శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది: సీఎం చంద్రబాబు

    • ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం అందరికీ కలగాలి: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం

  • Feb 15, 2026 08:51 IST

    సింగపూర్‌- హైదరాబాద్‌ విమానానికి బాంబు బెదిరింపు

    • బాంబు బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన అధికారులు

    • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం సేఫ్‌ ల్యాండింగ్‌

  • Feb 15, 2026 07:41 IST

    భక్తులతో ఆలయాలు కిటకిట..

    • తెలంగాణలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

    • వరంగల్‌లోని శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

    • వేయిస్తంభాల గుడి, రామప్ప, పాలకుర్తి,..

    • కాళేశ్వరం, సిద్దేశ్వరాలయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు

    • శివయ్య దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు

  • Feb 15, 2026 07:39 IST

    తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

    • మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

    • శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ బస్సులు నడుపుతున్న తెలంగాణ RTC

  • Feb 15, 2026 07:35 IST

    ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

    • దుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

  • Feb 15, 2026 07:34 IST

    ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

    • వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

    • ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న..

    • మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, విప్‌ ఆదిశ్రీనివాస్‌

  • Feb 15, 2026 07:34 IST

    ఉభయగోదావరి జిల్లాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు

    • పంచారామ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు

    • స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్న భక్తులు

  • Feb 15, 2026 07:33 IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

    • దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

    • తమిళనాడు, శ్రీలంకలో తేలికపాటి వర్షాలు

  • Feb 15, 2026 07:06 IST

    టీ20 వరల్డ్‌ కప్‌: నేడు కొలంబోలో భారత్‌ Vs పాక్‌ మ్యాచ్‌

    • పాక్‌ జట్టుతో కరచాలనం అంశంపై కొనసాగుతున్న సస్పెన్స్

    • హ్యాండ్‌షేక్‌పై టాస్‌ సమయంలో నిర్ణయం: సూర్యకుమార్‌

    • పాక్‌తో మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం: సూర్యకుమార్

    • ఒత్తిడి సమయాల్లో చాలా మ్యాచ్‌లు ఆడాం: సూర్యకుమార్‌

  • Feb 15, 2026 07:04 IST

    శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

    • తిరుపతి: మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

    • వేకువజాము నుంచి క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

    • రాహు కేతు సర్ప దోష నివారణ పూజలతో సహా ఆర్జిత సేవలన్నీ రద్దు

  • Feb 15, 2026 07:01 IST

    దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ

    • శైవక్షేత్రాలకు పెరిగిన భక్తుల రద్దీ

    • శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

    • శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాలు

    పూర్తి కథనం

  • Feb 15, 2026 06:48 IST

    శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు

    • మహా శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం

    • శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

    • తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు

    • సా.5 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం

    • రా.7 గంటలకు మల్లికార్జునస్వామికి అభిషేకం చేయనున్న జగద్గురు పీఠాధిపతి