ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 01 , 2026 | 07:23 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Feb 01, 2026 21:56 IST
BRS ఎమ్మెల్యేలతో ముగిసిన కేసీఆర్ సమావేశం
మున్సిపల్ ఎన్నికలపై చర్చించిన కేసీఆర్..
బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలి..
ఎన్నికల్లో BRSకు మంచి ఫలితాలు వస్తాయి: కేసీఆర్
త్వరలో చాలా మంది BRSలో చేరతారు: మాజీ సీఎం కేసీఆర్
-
Feb 01, 2026 21:39 IST
ఆర్థిక వ్యూహ పరీక్షలో విఫలం.. కేంద్ర బడ్జెట్‌పై చిదంబరం
కీలకమైన ఆర్థిక సవాళ్లను పట్టించుకోలేదు..
ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు..
ద్రవ్యలోటు, పన్ను మార్పుల్లో కూడా తేడా లేదు: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
-
Feb 01, 2026 21:31 IST
కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..
కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు: కేటీఆర్
ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్..
దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్: మాజీ మంత్రి కేటీఆర్
-
Feb 01, 2026 21:20 IST
ఇప్పుడు పవర్ భారత్ చేతుల్లో: ఎలాన్ మస్క్
చిక్కుల్లో ఉన్న ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చైనా, భారత్‌లు చోదకశక్తులుగా మారాయి: ఎలాన్ మస్క్
పవర్ ఇప్పుడు చైనా, భారత్ చేతుల్లోకి వెళ్తోంది: ఎలాన్ మస్క్
-
Feb 01, 2026 21:16 IST
అండర్-19 ప్రపంచ కప్.. పాకిస్థాన్ ఓటమి..
అండర్ -19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా..
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో టీమిండియా విజయం..
46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైన పాక్ జట్టు..
-
Feb 01, 2026 20:52 IST
జోగి రమేష్‌కు జగన్ ఫోన్..
జోగి రమేష్ నివాసంపై దాడిని ఖండించిన జగన్
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు..
ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూస్తున్నారు..
హింసా జ్వాలను సీఎం చంద్రబాబు రాజేశారు..
అవే మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహిస్తాయి: జగన్
జోగి రమేష్‌కు పార్టీ అండగా ఉంటుంది: జగన్
-
Feb 01, 2026 20:50 IST
నందినగర్‌కు భారీగా BRS శ్రేణులు..
హైదరాబాద్: నందినగర్‌కు భారీగా BRS శ్రేణులు..
కేసీఆర్ నివాసానికి BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చి కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం..
-
Feb 01, 2026 20:13 IST
కేసీఆర్ సిట్ విచారణపై కేటీఆర్ స్పందన
కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర: కేటీఆర్
మూర్ఖులకు చరిత్ర అర్థం కాదు: కేటీఆర్
ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్: కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో సెకను కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్: కేటీఆర్
-
Feb 01, 2026 20:06 IST
BRS భవన్ దగ్గర మరోసారి ఉద్రిక్తం..
BRS భవన్ నుంచి నందినగర్‌లోని.. కేసీఆర్ నివాసానికి వెళ్లేందుకు BRS నేతల యత్నం..
BRS నేతలను అడ్డుకున్న పోలీసులు..
గేటు ఎదుట BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బైఠాయింపు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS నేతల నినాదాలు.
-
Feb 01, 2026 19:58 IST
ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను నాలుగున్నర గంటలకు పైగా ప్రశ్నించిన సిట్..
నందినగర్ నివాసంలో కేసీఆర్‌ను ప్రశ్నించిన ఆరుగురు అధికారుల బృందం..
గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్..
కేసీఆర్ ఎదుట ఆధారాలు ఉంచి ప్రశ్నించిన సిట్ అధికారులు.
BRS ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై.. ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘ విచారణ..
విచారణ అనంతరం కేసీఆర్ నివాసం నుంచి వెళ్లిపోయిన సిట్ అధికారులు.
-
Feb 01, 2026 19:20 IST
తెలంగాణకు బీఆర్ఎస్ ఒక్కటే పేటెంట్ కాదు: కోదండరామ్
ప్రశ్నించే మీడియాపై దాడి చేయడం సరికాదు.
ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచి పద్ధతి కాదు.
పదేళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ఇలాంటి పద్ధతినే కొనసాగిస్తే ప్రజలకు మరింత దూరమవుతారు.
-
Feb 01, 2026 19:10 IST
అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.
రాజకీయ నాయకుల వ్యాఖ్యలు హుందాగా ఉండాలి: హైకోర్టు
ఎదుటివారిని నొప్పించకూడదని స్పష్టంచేసిన ఏపీ హైకోర్టు
అంబటి రాంబాబు నివాసం దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని కోర్టుకు తెలిపిన పోలీసులు.
అంబటి నివాసం దగ్గర 15 మంది పోలీసుల బృందం ఉందని కోర్టుకు తెలిపిన పోలీసుల తరఫు న్యాయవాది.
అన్ని విషయాలను రికార్డు చేసిన ఏపీ హైకోర్టు.
-
Feb 01, 2026 19:09 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా: కిషన్ రెడ్డి
ఫిబ్రవరి 7న మహబూబ్‌నగర్‌లో అమిత్ షా ప్రచారం.
ఫిబ్రవరి 4న నితిన్ నబీన్ ఎన్నికల ప్రచారం.
-
Feb 01, 2026 18:48 IST
ఢిల్లీ: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భయంకరంగా ఉంది: కిషన్ రెడ్డి
రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వలేదు, డీఏ ఇవ్వడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ.51 వేల కోట్లు ఇవ్వాలి.
కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాలలో ఇప్పటివరకు తొమ్మిదిన్నర లక్షల కోట్లు అప్పులు చేశారు.
-
Feb 01, 2026 18:40 IST
ములుగు: మేడారంలో భారీగా పేరుకుపోయిన చెత్తా, చెదారం
భక్తులు పడేసిన జంతు వ్యర్థాలతో దుర్గంధ భరితంగా మేడారం పరిసరాలు.
పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు.
-
Feb 01, 2026 18:39 IST
ABN ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై బీఆర్ఎస్ దాడిని ఖండించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
మీడియా ప్రతినిధిపై దాడి మంచి సంప్రదాయం కాదు.
దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
మీడియాపై దాడిని అందరూ ఖండించాలి.
రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
మీడియాపై దాడి మంచి సంస్కృతి కాదు.
-
Feb 01, 2026 18:35 IST
ABN ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ దాడి గర్హణీయం: మంత్రి పొన్నం
మీడియాపై దాడి మంచి సంస్కృతి కాదు.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించని పార్టీ బీఆర్ఎస్.
ప్రశ్నించే గొంతుకలపై దాడి అత్యంత దారుణం.
-
Feb 01, 2026 17:55 IST
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు రఘునాథ్‌రెడ్డి(56) మృతి.
గుండెపోటుతో చనిపోయిన రఘునాథ్ రెడ్డి.
370కి పైగా సినిమాల్లో నటించిన రఘునాథ్‌రెడ్డి.
-
Feb 01, 2026 17:55 IST
కృష్ణా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత
జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టిన టీడీపీ కార్యకర్తలు.
జోగి రమేష్ నివాసంపై టీడీపీ శ్రేణుల రాళ్ల దాడి.
మైలవరం నుంచి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు.
దాడి సమయంలో ఇంట్లో లేని జోగి రమేష్ కుటుంబం.
-
Feb 01, 2026 17:49 IST
కృష్ణా: ఇబ్రహీంపట్నంలో ABN సిబ్బందిపై దాడికి వైసీపీ మూకల యత్నం
వైసీపీ మూకలను అడ్డుకున్న స్థానికులు, టీడీపీ కార్యకర్తలు.
వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు.
-
Feb 01, 2026 17:15 IST
బీఆర్ఎస్ భవన్ దగ్గర ABN సిబ్బందిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.
కవరేజీలో ఉన్న ABN రిపోర్టర్, కెమెరామన్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.
ABN ఆంధ్రజ్యోతి కెమెరా ధ్వంసం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.
-
Feb 01, 2026 08:29 IST
ముంబై: జుహులో కాల్పుల కలకలం
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు
రాత్రి 12:40కి ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు
కాల్పులు జరిపి బైక్‌పై వెళ్లిపోయిన గుర్తుతెలియని యువకుడు
ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం, కేసు నమోదు
-
Feb 01, 2026 08:27 IST
కేసీఆర్ విచారణ సందర్భంగా నందినగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు
నందినగర్ బస్‌స్టాప్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్ దగ్గర ఆంక్షలు
స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసుల సూచన
-
Feb 01, 2026 08:26 IST
మూడోరోజు పర్యటన
కుప్పంలో మూడోరోజు సీఎం చంద్రబాబు పర్యటన
కార్యకర్తలతో సమావేశంకానున్న చంద్రబాబు
-
Feb 01, 2026 07:26 IST
రాష్ట్రపతిని కలవనున్న నిర్మల
కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
రాష్ట్రపతికి బడ్జెట్ సమర్పించి అనుమతి తీసుకోనున్న నిర్మల
-
Feb 01, 2026 07:25 IST
నేడే కేంద్ర బడ్జెట్..
నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ఉ.11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
ఆత్మనిర్భర్, వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
-
Feb 01, 2026 07:24 IST
బీఆర్ఎస్ ఆందోళనలు..
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు
కేసీఆర్‌కు సిట్ నోటీసులు వ్యతిరేకిస్తూ నిరసనలకు BRS పిలుపు
-
Feb 01, 2026 07:23 IST
హైదరాబాద్: నేడు సిట్ విచారణకు కేసీఆర్
మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్