Share News

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల కలకలం

ABN , Publish Date - Feb 01 , 2026 | 08:15 AM

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున ముంబై జుహులోని ఆయన ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు.

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల కలకలం
Bollywood filmmaker Rohit Shetty

ముంబై, ఫిబ్రవరి 1: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున జుహులోని ఆయన ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని ముంబై పోలీస్ కమిషనర్ దేవెన్ భర్తీ ధ్రువీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు రోహిత్ శెట్టి నివసిస్తున్న బిల్డింగ్‌పై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదని వెల్లడించారు. ఇక, ఈ సంఘటనపై స్థానిక పోలీసులతోపాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.


కాల్పుల నేపథ్యంలో రోహిత్ ఇంటి వద్ద అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే, ఈ కాల్పులకు తెగబడింది ఎవరు? ఎందుకు? అన్న సంగతి తెలియరాలేదు. పోలీసులు కూడా ఈ సంఘటనపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో రోహిత్ శెట్టి ఉన్నారా? లేదా అన్నదానిపైనా క్లారిటీ లేదు. రోహిత్ శెట్టి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. సోషల్ మీడియాలో రోహిత్ శెట్టి ఇంటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో డైరెక్టర్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్న దృశ్యాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం ఫుల్..

ట్రాఫిక్‌లో నరకయాతన!

Updated Date - Feb 01 , 2026 | 08:35 AM