Share News

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం ఫుల్..

ABN , Publish Date - Feb 01 , 2026 | 08:07 AM

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే కొంత మొత్తం ధనం అందుతుందని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

ఆ రాశివారికి ఈ వారం ఆదాయం ఫుల్..

అనుగ్రహం

1 - 7 ఫిబ్రవరి 2026

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

mesham.jpgఅన్ని విధాలా కలిసివచ్చే సమయం. కార్యం సిద్ధిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఆత్మీయు లతో సంభాషిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. మితంగా సంభాషించండి. ముఖ్యమైన పత్రాలు అందు కుంటారు. దూరప్రయాణం తలపెడతారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgలావాదేవీల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవు తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనాన్ని సామరస్యంగా రాబట్టుకోవాలి. మొక్కు బడిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సత మతమవుతారు. కావలసిన వస్తువులు సమ యానికి కనిపించవు. చీటికిమాటికి చికాకు పడతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పిల్లలకు శుభఫలితా లున్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgసంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. నూతన పరిచయాలు బలపడతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆత్మీయులకుముఖ్య సమాచారం అందిస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అందరితోనూ మితంగా సంభాషించండి. చర్చల్లో పాల్గొంటారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

simham.jpgప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. త్వరలో పరిస్థితులు చక్క బడతాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా ముందుకు సాగుతారు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

kanya.jpgఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పాదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనవసర విష యాల్లో జోక్యం తగదు. కొత్తసమస్య ఎదు రయ్యే సూచనలున్నాయి. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgఅనుకూలతలున్నాయి. శుభ కార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు పుర మాయించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgఅవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు ఒక పట్టాన సాగవు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgవ్యవహారజయం, ధనప్రాప్తి ఉన్నాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనసహా యం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. గృహప్రశాంతత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. ప్రయాణం కలిసివస్తుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgఅనుకూలతలు అంతంత మాత్రమే. తప్పటడుగు వేస్తారు. అనుభవ జ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. ధనసమస్య ఎదురయ్యే సూచన లున్నాయి. ఆందరితోనూ ఆచితూచి మాట్లా డండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్తయత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgమీదైన రంగంలో రాణిస్తారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆశిం చిన పదవి దక్కదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. సన్నిహితుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

కుప్పానికి ప్రగతి కళ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2026 | 08:07 AM