హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు

ABN, Publish Date - Jun 27 , 2026 | 07:54 AM

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, హీరో రామ్ పోతినేని, పాల్గొన్నారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 1/23

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 2/23

ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, హీరో రామ్ పోతినేని, పాల్గొన్నారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 3/23

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క యువతకు డ్రగ్స్‌ వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ కీలక సందేశాన్ని ఇచ్చారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 4/23

డ్రగ్స్ అనేది ఒక ప్రమాదకరమైన ఊబి లాంటిదని, ఒకసారి దానికి అలవాటు పడితే ఆ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టమని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 5/23

క్షణికమైన ఆనందం కోసం డ్రగ్స్‌ వైపు అడుగులు వేయడం ద్వారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతను భట్టి విక్రమార్క కోరారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 6/23

జీవితంలో ఎన్నో అవకాశాలు, లక్ష్యాలు, విజయాలు సాధించాల్సి ఉన్న సమయంలో డ్రగ్స్‌కు బానిస కావడం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా తీవ్ర నష్టాలు ఎదురవుతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 7/23

ఒకసారి డ్రగ్స్‌కు అలవాటు పడిన తర్వాత మళ్లీ సాధారణ జీవితంలోకి రావడం చాలా క్లిష్టమవుతుందని, అందుకే మొదటి అడుగే డ్రగ్స్ వైపు వేయకపోవడం ఉత్తమమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 8/23

డ్రగ్స్ తీసుకోవాలని స్నేహితులు లేదా పరిచయస్తులు ఒత్తిడి చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని భట్టి విక్రమార్క సూచించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 9/23

డ్రగ్స్ అనేది వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబాల భవిష్యత్తుకు, సమాజ శాంతి భద్రతలకు కూడా పెద్ద ముప్పుగా మారుతోందని రామ్ పేర్కొన్నారు. యువత తమ ప్రతిభ, శక్తి, సమయాన్ని సానుకూల దిశలో వినియోగించి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 10/23

అలాంటి సందర్భాల్లో సంకోచించకుండా, ధైర్యంగా వారి ముఖం మీదే ‘నో’ అని చెప్పాలని యువతకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 11/23

డ్రగ్స్ నెట్‌వర్క్‌ను చేధించడంలో ఈగల్ టీమ్ బాగా పనిచేస్తోందనిమంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 12/23

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 13/23

యువత మంచి భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలనిహీరో రామ్ సూచించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 14/23

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలను రామ్ పోతినేని అభినందించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 15/23

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని రామ్ కొనియాడారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 16/23

డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడం, డ్రగ్స్ మాఫియాను గుర్తించడం, నేరస్తులపై చర్యలు తీసుకోవడంలో ఈగల్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తోందని రామ్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 17/23

డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఈగల్ ప్రత్యేక బృందం మంచి ఫలితాలు సాధిస్తోందని రామ్ చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 18/23

డ్రగ్స్ సమస్యను కేవలం ప్రభుత్వాలు లేదా పోలీసు శాఖ మాత్రమే ఎదుర్కోలేవని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని రామ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 19/23

ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తేనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రామ్ వివరించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 20/23

కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలిసి యువతను సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని రామ్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 21/23

తమ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా, విక్రయిస్తున్నా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 22/23

డ్రగ్స్‌ వల్ల కలిగే ప్రమాదాల గురించి నటి మీనాక్షీ చౌదరి అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు 23/23

సమాజం కోసం ధైర్యంగా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అని డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు.

Updated at - Jun 27 , 2026 | 08:14 AM