విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత

ABN, Publish Date - Oct 12 , 2026 | 08:14 AM

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 1/15

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 2/15

ఆదివారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 3/15

ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 4/15

దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రామ్మోహన్ పేర్కొన్నారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 5/15

ఆదివారం ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని రామ్మోహన్ తెలిపారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 6/15

భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆవాంఛనాయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు విజయవంతంగా పూర్తి కావాలని రామ్మోహన్ ఆకాంక్షించారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 7/15

రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించానని రామ్మోహన్ అన్నారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 8/15

దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ పరవళ్లతో ప్రజలకు సరికొత్త అనుభూతి కలుగుతుందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 9/15

మైసూరు ఉత్సవాల స్థానంలో దసరా, విజయవాడ ఉత్సవాల గురించి అందరు చర్చించుకుంటున్నారని అనిత వెల్లడించారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 10/15

విజయవాడ ఉత్సవ్, దసరా ఉత్సవాలకు వచ్చిన అందరికీ హోం మంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 11/15

విజయవాడ ఉత్సవ్‌ను పది రోజుల పాటు వైభవంగా నిర్వహించడమంటే చిన్న విషయం కాదని హోం మంత్రి అనిత తెలిపారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 12/15

విజయవాడ ఉత్సవ్‌‌ను గత ఏడాది తొలి సీజన్‌లో పది రోజుల పాటు నిర్వహించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కించారని హోం మంత్రి అనిత ఉద్ఘాటించారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 13/15

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును దేశంలో ప్రతి కుటుంబం తమ బిడ్డగా భావించడం మనకందరికీ గర్వ కారణమని హోం మంత్రి అనిత తెలిపారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 14/15

ఆ కనకదుర్గమ్మను పూజించిన విధంగా ప్రతి ఆడబిడ్డను మనం గౌరవించుకోవాలని, భద్రత, భరోసా ఇవ్వాలని అనిత ఆకాంక్షించారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రామ్మోహన్, అనిత 15/15

ఇలాంటి ఉత్సవాల ద్వారా ప్రజల్లో మరింత నూతన ఉత్తేజం వస్తుందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

Updated at - Oct 12 , 2026 | 02:15 PM