అమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం
ABN , Publish Date - Jul 13 , 2026 | 10:20 PM
అమెరికా చరిత్రలో తొలిసారిగా సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం నిర్వహిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, (ఆంధ్రజ్యోతి): అమెరికా చరిత్రలో తొలిసారిగా సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు జరిగే ఈ క్రతువులో ప్రతిరోజు ఉదయం మహాన్యాస పూర్వక శతరుద్ర హోమం, సాయంత్రం శతచండీ పారాయణం హోమం నిర్వహించనున్నారు. మొత్తం ఐదు రోజుల్లో మూడు సార్లు చండీ పారాయణం చేయనున్నారు.
ఈ మహాయాగంలో శతచండీ, శత రుద్ర యాగాలతో పాటు దశసహస్ర మోదక, ప్రత్యంగిరా, రాజశ్యామల, వారాహీ, నక్షత్ర, అరుణ హోమాలు, దుర్గ, సరస్వతి, గాయత్రి, లక్ష్మీ దేవతలకు మూడు తామర పుషాలతో మహా కమలార్చన హోమం ప్రత్యేకంగా ఏరాఁటు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు భారతదేశం నుంచి పలువురు రుత్వికులు పాల్గొంటున్నారు. ఈ యాగం కోసం ప్రత్యేక యాగశాల, తొమ్మిది హోమకుండాలు, భక్తుల కోసం ప్రత్యేక ఏరాట్లు, అన్నప్రసాదం, వసతి, రవాణా వంటివి ఏరాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ కమిటీల చైర్మన్లు, సభ్యులు, వందలాది మంది స్వచ్ఛంద సేవకులు రాత్రింబవళ్లు సేవలందిస్తున్నారని యాగ కమిటీ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. శివపార్వతి, వల్లీదేవసేన, సుబ్రహ్మణ్య, శ్రీనివాస, శ్రీలక్ష్మీనరసింహ, సీతారామ, రుక్మిణీకృష్ణ కళ్యాణాలను నిర్వహిస్తున్నామని కమిటీ ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్‌లు తెలిపారు. ఈ వేడుక నిర్వహణకు ఇప్పటివరకు భారీగా నగదు సమకూరినట్లు మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనేని వెల్లడించారు. లోకకళ్యాణమే సంకలంగా అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ప్రవాసులు విరివిగా పాల్గొనాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.
ఈ వార్తలు చదవండి
డాలస్‌లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి మునిరత్నం నాయుడికి ఘనస్వాగతం
టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ పూర్తిచేసిన తానా బోర్డ్ చైర్మన్
Read Latest NRI News And AP News And International News And Telugu News