మ్యాజిక్ నెయిల్‌పాలిష్
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:34 PM
నెయిల్ పాలిష్ మిగతా వేళ్లకు అంటకుండా వేసు కోవడం, అది ఆరే వరకు వేచి చూడటం... యమా బోర్ అనుకుంటున్నారా? ఒక్క యాప్‌తో క్షణాల్లో గోళ్ల రంగును మార్చుకోగలిగే ఓ హైటెక్ మ్యాజిక్ ఆవిష్కరణ ఫ్యాషన్ ప్రపంచంలోకి దూసుకొచ్చింది.
నెయిల్ పాలిష్ మిగతా వేళ్లకు అంటకుండా వేసు కోవడం, అది ఆరే వరకు వేచి చూడటం... యమా బోర్ అనుకుంటున్నారా? ఒక్క యాప్‌తో క్షణాల్లో గోళ్ల రంగును మార్చుకోగలిగే ఓ హైటెక్ మ్యాజిక్ ఆవిష్కరణ ఫ్యాషన్ ప్రపంచంలోకి దూసుకొచ్చింది. అదే... ‘ఐ-పాలిష్’. ఈ స్మార్ట్ నెయిల్ కిట్‌లో ఇచ్చే యాక్రిలిక్ నెయిల్‌ను (ఒక కిట్‌లో 24 ఉంటాయి) హైపర్ గ్లూ సాయంతో గోరుపై అతికించాలి. ఆపై స్మార్ట్‌ఫోన్‌లో ‘ఐ పాలిష్’ యాప్ డౌన్‌లోడ్ చేసి, బ్లూటూత్ సాయంతో మ్యాజిక్ వాండ్‌ను (స్టేప్లర్ పరిమాణంలో ఉంటుంది) ఫోన్‌కు కనెక్ట్ చేయాలి.
తర్వాత యాప్‌లో ఉన్న రంగురంగుల షేడ్స్‌లో (400 కన్నా ఎక్కువ) నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని, గోరును మ్యాజిక్ వాండ్ లోపల పెట్టి, యాప్‌లో ‘అప్లై’ బటన్ నొక్కితే చాలు.. కేవలం 5 సెకన్లలోనే గోరు రంగు మారిపోతుంది. ‘ఎలక్ట్రోఫోరెటిక్ నానో పాలిమర్’ టెక్నాలజీని ఉపయోగించి, విద్యుత్ సంకేతాల ద్వారా రంగులను మార్చుకునేలా ఈ స్మార్ట్ నెయిల్స్‌ను రూపొందించింది అమెరికాకు చెందిన ఐ పాలిష్ కంపెనీ. కిట్‌లో ఉండే ప్రతీ యాక్రిలిక్ నెయిల్స్ లోపల లక్షలాది మైక్రోస్కోపిక్ క్యాప్యూల్స్ ఉంటాయి.
ఈ క్యాప్యూల్స్‌లో వేర్వేరు రంగులు కలిగిన సూక్ష్మ కణాలుంటాయి. ఇవి విద్యుత్ సంకేతాలకు అనుగుణంగా స్పందిస్తాయి. ఉదాహరణకు ఎరుపు రంగు కావాలంటే... గోరుని మ్యాజిక్ వాండ్‌లో పెట్టినప్పుడు, దాని నుంచి వచ్చే విద్యుత్ సంకేతం గోరులోని ఎరుపు రంగు కణాలను పైకి లాగుతుంది. అదే సమయంలో మిగిలిన రంగు కణాలను కిందకు నెట్టేస్తుంది. ఇవి 14 రోజుల వరకు చెక్కు చెదరవు. ఈ ఏడాది జూన్ నాటికి మ్యాజిక్ నెయిల్‌కిట్ మార్కెట్లోకి వస్తుందట.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News