సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:11 PM
సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ సంఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటుచేసుకుంది.
హైదరాబాద్, మార్చి 8: సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ సంఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్‌క్యూ 519 విమానం శనివారం ఉదయం 155 మంది ప్రయాణీకులతో సింగపూర్ వెళ్లడానికి సిద్ధమైంది. ఉదయం 10.55 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. ప్రయాణీకులు బోర్డింగ్ గేట్ వద్ద విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో విమానంలో బాంబులు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తి ఎయిర్‌పోర్టు భద్రతాధికారులకు ఈ మెయిల్ పంపాడు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానాన్ని ఎయిర్ సైడ్ అధికారులు ఇసోలేషన్‌కు తరలించి తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి బాంబులు విమానంలో దొరకలేదు. దాదాపు 13 గంటల తర్వాత విమానం సింగపూర్ బయలుదేరింది. ఈ సంఘటనపై జీహెచ్ఏఎల్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేపట్టారు.
కొద్దిరోజుల క్రితం కూడా..
ఫిబ్రవరి 14వ తేదీన సింగపూర్ - హైదరాబాద్ విమానానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు విమానాన్ని సురక్షితంగా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను దింపిన అనంతరం.. ఆ విమానాన్ని ఖాళీ టెర్మినల్ వద్దకు తరలించి తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులతో పాటు ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
నిన్నటి జ్ఞాపకం... లైబ్ర‘రీలు’గా...
మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ.. ఈ విధంగా చేస్తే సూపర్ టేస్ట్