Share News

ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనం ప్రారంభం

ABN , Publish Date - Mar 08 , 2026 | 10:42 AM

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనం ప్రారంభం
Telangana Legislative Council Building Inauguration

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


1905లో నిర్మితమైన ఈ టౌన్ హాల్ భవనం రాజస్థాన్, పర్షియన్ శైలుల అద్భుతమైన కళతో సుందరంగా నిర్మించారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ భవనం అప్పట్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అసెంబ్లీ, శాసనమండలి రెండూ ఒకే ప్రాంగణంలో పనిచేసేవి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రెండు సభలు వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో శాసన కార్యకలాపాలు ఒకే ప్రాంతంలో ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక వారసత్వాన్ని కాపాడే దిశగా చర్యలు చేపట్టారు. హెరిటేజ్ విలువ కలిగిన ఈ భవనాన్ని పరిరక్షిస్తూ ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించే పనులు చేపట్టారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో శాసనమండలి భవనం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి.


Also Read:

దారుణం.. ముగ్గురు కూతుళ్లను పోషించలేక హత్య చేసిన తండ్రి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రముఖుల శుభాకాంక్షలు..

For More Latest News

Updated Date - Mar 08 , 2026 | 12:06 PM