ప్రేమికుల బ్రేకప్.. అశ్లీల సైట్లలో ప్రియురాలి వీడియోలు
ABN , Publish Date - Nov 29 , 2026 | 09:57 PM
తన మాజీ లవర్ తన ప్రైవేటు వీడియోలను పలు అశ్లీల వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడని బెంగళూరులో పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కనీసం 19 వెబ్సైట్లలో తనకు సంబంధించిన వీడియోలు ప్రసారమవుతున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: తన మాజీ లవర్ తన ప్రైవేటు వీడియోలను పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడని బెంగళూరులో పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కనీసం 19 వెబ్సైట్లలో తనకు సంబంధించిన వీడియోలు ప్రసారమవుతున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు, నిందితుడు 2023 అక్టోబర్ నుంచి 2024 ఆగస్టు వరకు సహజీవనం చేశారు. ఆ సమయంలో ఆమె లవర్ తమ ఇద్దరి మొబైల్ ఫోన్లలో వారి ప్రైవేటు వీడియోలు రికార్డు చేశాడు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2024 ఆగస్టులో విడిపోయారు. దీంతో తన ప్రైవేటు వీడియోలను తొలగించాలని మాజీ భాగస్వామిని ఆమె కోరింది. వీడియోలను డిలీట్ చేసినట్లు అతడు చెప్పాడు.
ఈనెల 6న కొందరు పరిచయస్తులు బాధితురాలికి ఫోన్ చేసి, ఆమె వీడియోలను పలు అశ్లీల వెబ్సైట్లలో చూశామని ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వెబ్సైట్లను పరిశీలించగా తనకు సంబంధించిన వీడియోలు కనిపించాయని బాధితురాలు బెంగళూరులోని సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై నిందితుడిని నిలదీయగా ఆ వీడియోలను తాను తొలగించలేదని, ఇంకా తన వద్దే ఉన్నాయని అంగీకరించాడని ఆరోపించింది. ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపింది. వీడియోలు ఉన్న వెబ్సైట్ల లింకులను పోలీసులకు అందించింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్