Share News

వరిచేనులో మహిళ మృతదేహం.. ప్రియుడే..

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:32 PM

బిహార్‌లోని ముంగేర్‌ జిల్లాలో ఉన్న ఓ వరిచేనులో 30 ఏళ్ల మహిళ మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. గొంతు తెగడం వల్ల ఆమె మరణించినట్టు పోలీసులు గుర్తించారు.

వరిచేనులో మహిళ మృతదేహం.. ప్రియుడే..
Munger Murder Case

పట్నా, నవంబర్ 29: బిహార్‌లోని ముంగేర్‌ జిల్లాలో ఉన్న ఓ వరిచేనులో 30 ఏళ్ల మహిళ మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. గొంతు తెగడం వల్ల ఆమె మరణించినట్టు పోలీసులు గుర్తించారు. నిన్న (శనివారం) జరిగిందీ ఘటన. మహిళ ప్రియుడే ఈ హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడి పోలీసులు సమాచారం ప్రకారం.. ముంగేర్‌కు చెందిన ఆ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే ఆమెకు తిలక్‌పూర్‌కు చెందిన అనకేష్ కుమార్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధముంది. ఈ విషయం ఆరు నెలల క్రితమే ఆమె భర్తకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం పది గంటల సమయంలో సదరు మహిళ మరణించినట్టు పోలీసులకు సమాచారం అందింది.


వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. సాక్ష్యాలు, ఆధారాలను సేకరించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన వెనుక అనకేష్ కుమార్ హస్తం ఉందని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి వాంగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు. కాగా ఈ హత్య జరిగిన సమయంలో తాను ఊరిలో లేనని మృతురాలి భర్త పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలూ చదవండి

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది భక్తుల మృతి

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Updated Date - Nov 29 , 2026 | 04:34 PM