గ్లోబల్ సమ్మిట్‌లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:00 AM
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్--2026’ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ఇన్‌చార్జి మంత్రులతో సమన్వయానికి సీనియర్ ఐఏఎస్ అధికారుల నియామకం
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్--2026’ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మెగా సదస్సులో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరినీ ప్రత్యక్షంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సదస్సు విశేషాలు, పెట్టుబడి అవకాశాలను క్షేత్రస్థాయి నేతలకు వివరించేందుకు ఉమ్మడి పది జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులతో సమన్వయం చేసుకునేలా సీనియర్ ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.
దీని ప్రకారం హైదరాబాద్ జిల్లాకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్ రంజన్ వ్యవహరించనున్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- వికాస్‌రాజ్, కరీంనగర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు- బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా, మెదక్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి- డీఎస్ లోకేశ్‌కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క- డాక్టర్ యోగితా రాణా, నల్లగొండకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ - హరిచందన దాసరి, ఆదిలాబాద్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు- కె.ఇలంబర్తి సమన్వయకర్తలుగా ఉంటారు. ఇక వరంగల్ జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - కృష్ణ ఆదిత్య, మహబూబ్‌నగర్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ - వీపీ గౌతమ్, ఖమ్మం జిల్లాకు మంత్రి వాకిటి శ్రీహరి- అనుదీప్ దురిశెట్టిలను ప్రభుత్వం నియమించింది.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News