బెంగాల్‌లో ఇక్కడ గెలిచిన పార్టీదే ‘అధికారం’
ABN , Publish Date - May 04 , 2026 | 09:02 AM
దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వీటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
కోల్‌కతా, మే04: దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వీటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వరుసగా నాలుగోసారి మమతా బెనర్జీ అధికారాన్ని అందుకుంటారా? లేకుంటే మమత పాలనకు బీజేపీ చరమ గీతం పాడనుందా? అంటూ ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నాటి నుంచి నేటి వరకు..
అయితే పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 37 నియోజకవర్గాల్లో ఏ రాజకీయ పార్టీకి అత్యధికంగా ఓట్లు వస్తాయో.. ఆ పార్టీ అధికారం అందుకుంటుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. 1977 నాటి నుంచి నేటికి ఈ పరిస్థితి కొనసాగుతోందని వారు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ఈ సీట్లలో సుమారు 15 నుంచి 20 శాతం సెంట్రల్ కోల్‌కతా, దక్షిణ బెంగాల్, నైరుతి బెంగాల్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయని చెబుతున్నారు.
ఐదు దశాబ్దాలు.. రెండు పార్టీలే..
దాదాపు 50 ఏళ్ల పాటు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని రెండు పార్టీలే పాలించాయి. 34 సంవత్సరాలు జ్యోతి బసు నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని ఏలాయి. కానీ ఈ సారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీల మధ్య ప్రధాన పోరు ఉన్న సంగతి తెలిసిందే.
2021లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోరు నడించింది. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి సువేందో అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మరి ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీతోపాటు టీఎంసీ రాజకీయ భవితవ్యంపై బెంగాల్ ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వనున్నారే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ
For More National News And Telugu News