Share News

బీజేపీపై దీదీ తీవ్ర ఆరోపణలు

ABN , Publish Date - May 04 , 2026 | 08:45 AM

ఎన్నికల కౌంటింగ్‌కు ముందు బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయన్నారు.

బీజేపీపై దీదీ తీవ్ర ఆరోపణలు
West Bengal CM Mamata Banerjee

కోల్‌‌కతా, మే 04: ఎన్నికల కౌంటింగ్‌కు ముందు బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయన్నారు. సీసీ టీవీలు కూడా ఆఫ్ అయ్యాయని పేర్కొన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లు ఉంచిన ప్రదేశాలకు వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ బీజేపీ అదేశాల మేరకే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు నెలకున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా కాయాలంటూ పార్టీ కేడర్‌కు సూచించారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ కోసం అధికారులను డిమాండ్ చేయాలని కేడర్‌ను పశ్చిమ బెంగాల్ సీఎం కోరారు.


మరోవైపు కోల్‌కతాలోని ఖుదీరామ్ అనుశిలిని స్టేడియంలో కెమెరా ఆఫ్ చేసి ఉన్న కంప్యూటర్ స్క్రీన్‌ వీడియోను మమత కేబినెట్‌లోని మంత్రి శశి పంజా తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. వీడియో ఆఫ్ చేసిన ఫుటేజ్‌ తమకు చూపించాలని అధికారులను తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు. శ్యామ్‌పుకూర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా శశి పంజా బరిలో నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ

మన బంగారం.. మన దేశానికి!

For More National News And Telugu News

Updated Date - May 04 , 2026 | 09:19 AM