Share News

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:41 PM

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం లేదా నడవడికను ప్రశ్నించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court

ఢిల్లీ, జూన్8 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం లేదా నడవడికను ప్రశ్నించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రేమ సంబంధాలు అన్నీ వివాహానికి దారితీయవని తెలిపింది. ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడిన ప్రేమ బంధం తర్వాత వివాహంగా మారకపోయినా, దానిని మోసం లేదా నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.


అలాగే, ప్రేమలో ఉన్న సమయంలో వివాహం చేసుకుంటామని భావించి శారీరక సంబంధం ఏర్పడినప్పటికీ, తర్వాత వివిధ కారణాల వల్ల పెళ్లి జరగకపోతే ప్రతి సందర్భంలోనూ అది మోసం చేసినట్లుగా భావించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడిన సమయంలో వివాహం చేసుకునే నిజమైన ఉద్దేశం ఉందా?, లేదా? అనే అంశాన్ని ఆయా కేసుల వారీగా పరిశీలించాల్సి ఉంటుందని న్యాయస్థానం సూచించింది.


ఇద్దరి పరస్పర సమ్మతితో ఏర్పడిన సంబంధాలు, మోసపూరితంగా వివాహ వాగ్దానం చేసి ఏర్పడిన సంబంధాల మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది. కేవలం సంబంధం వివాహానికి దారితీయలేదనే కారణంతో ఒకరిపై మరొకరు మోసపూరిత ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛ, పరస్పర అంగీకారం, ఆధునిక సామాజిక సంబంధాలపై న్యాయవ్యవస్థ దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

నువ్వు ఎంత రెచ్చగొట్టిన నేను తొందరపడను.. సీఎంకి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 05:39 PM