మీరు అబద్ధాలు చెప్పారు.. మా అమ్మ నిజాలు మాట్లాడుతున్నారు: ప్రియాంక
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:15 PM
కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సమయంలో ఆమె కూతురు ప్రియాంకా వాద్రా గాంధీ స్పందించారు. తల్లికి అండగా నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సమయంలో ఆమె కూతురు ప్రియాంకా వాద్రా గాంధీ స్పందించారు. తల్లికి అండగా నిలిచారు. కేరళలోని తన నియోజకవర్గం వయనాడ్‌లో గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. తన తల్లి ఆత్మకథ పుస్తకాన్ని బీజేపీ నేతలు చదవడం తనకు సంతోషంగా ఉందన్నారు. అయితే, గత పదేళ్లుగా తన తల్లి గురించి బీజేపీ, ఆరెస్సెస్ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని, అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
‘నా తల్లిపై బీజేపీ, ఆరెస్సెస్, ఇతరులు తీవ్రంగా విమర్శలు చేసినా ఆమె స్పందించలేదు. నా తల్లి గురించి వారు అబద్ధాలు చెప్పారు. ఏవేవో కథలు అల్లారు. అయినా కూడా ఆమె ఏమీ అనలేదు. ఇప్పుడు తన స్టోరీ చెబుతున్నారు. ఆ హక్కు నా తల్లికి ఉంది. సంతోషించాల్సిన విషయం ఏమంటే బీజేపీ నేతలు కూడా ఆమె ఆత్మకథ చదువుతున్నారు. ఇన్నేళ్లుగా వారు (బీజేపీ) నా తల్లి గురించి అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె నిజం చెబుతున్నారు’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా సోనియాకు మద్దతుగానిలిచారు. తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకునే స్వేచ్ఛ ఆమెకు ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా.. వయనాడ్‌లో ప్రియాంక గురువారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..