Share News

అమితాబ్‌కు మూడోసారి బాంబు బెదిరింపు.. భద్రతా బలగాల అలర్ట్

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:00 PM

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. ఆయనకు ఇలాంటి బెదిరింపు రావడం మూడు వారాల్లో మూడోసారి ఇది. గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు పంపాడు.

అమితాబ్‌కు మూడోసారి బాంబు బెదిరింపు.. భద్రతా బలగాల అలర్ట్

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. ఆయనకు ఇలాంటి బెదిరింపు రావడం మూడు వారాల్లో మూడోసారి ఇది. గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు పంపాడు. ముంబైలో జుహులోని అమితాబ్ నివాసం జల్సాతో పాటు మేయర్ కార్యాలయం, బ్యాంకు, కోర్టు, మహాలక్షి రేస్‌కోర్స్, ముంబై విమానాశ్రయం కూడా ఈ బెదిరింపుల జాబితాలో ఉన్నాయి. దీంతో భద్రతా బలగాలతో పాటు ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్లు ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేశాయి. అలాగే ఆ బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని ట్రేస్ చేయడానికి సైబర్ ఇన్విస్టిగేటర్లు ప్రయత్నిస్తున్నారు.


కాగా.. గత నెల 23న కూడా ఇలాగే ఒక బాంబు బెదిరింపు వచ్చింది. అమితాబ్ నివాసంతో పాటు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒక స్కూల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ మెయిల్ పంపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య జల్సాపై దాడి జరగవచ్చని బెదిరించారు. దాంతో అమితాబ్ బంగ్లా ప్రాంతంలో భద్రతను పెంచారు. అలాగే, ఈనెల 6న మరో బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. మహాలక్ష్మి రేస్‌కోర్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అమితాబ్ నివాసం ఆ బెదిరింపుల జాబితాలో ఉన్నాయి. తాజాగా మూడోసారి మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీనిపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్


ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 05:42 PM