Share News

కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.7 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్..

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:34 PM

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను కూడా చంపేస్తామంటూ ఓ వ్యక్తి హెచ్చరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.7 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్..
Arvind Kejriwal

ఇంటర్నెట్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను కూడా చంపేస్తామంటూ ఓ వ్యక్తి హెచ్చరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ చెప్పుకున్న ఆ వ్యక్తి.. రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పంజాబ్‌లోని మొహాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు (Kejriwal Gets Death Threat).


ఈ బెదిరింపుల వ్యవహారం ఢిల్లీలోని తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ సందేశం కూడా పంపినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై నవంబర్ 6న మొహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi Gang) గ్యాంగ్‌కు చెందినవాడినని చెప్పుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


తనకు రూ.7 కోట్లు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకపోతే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను హత్య చేస్తామని బెదిరించినట్లు జర్నైల్ సింగ్ తెలిపారు (Rs 7 Crore Extortion). ఫోన్ కాల్‌లో చెప్పిన విషయాలనే వాట్సాప్ సందేశంలోనూ పునరావృతం చేసినట్లు పేర్కొన్నారు. ఆ సందేశానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా పోలీసులకు అందజేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేపట్టిన మొహాలీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బెదిరింపులకు ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు. ఇందుకోసం కాల్ డీటెయిల్ రికార్డులు (సీడీఆర్), ఐపీ లాగ్స్, ఫోన్ లొకేషన్ వివరాలను పరిశీలించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్


ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 02:25 PM