వారికి భయం పోయింది..
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:44 AM
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బతికున్నంతవరకూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆమెను చూస్తేనే భయంతో వణికిపోయేవారని, ఆ తరువాత తాను జైలుకు వెళ్లడంతో వారిలో భయం పూర్తిగా పోయిందని ఆలిండియా పురట్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం నాయకురాలు శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.
శశికళ ఆవేదన
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బతికున్నంతవరకూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆమెను చూస్తేనే భయంతో వణికిపోయేవారని, ఆ తరువాత తాను జైలుకు వెళ్లడంతో వారిలో భయం పూర్తిగా పోయిందని ఆలిండియా పురట్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం నాయకురాలు శశికళ ఆవేదన వ్యక్తం చేశారు. తిరువారూరు జిల్లా మన్నార్గుడిలో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ డీఎంకే ప్రభుత్వం గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజల బాగోగులను పట్టించుకోలేదని ఆరోపించారు.
జయలలిత బ్రతికి ఉన్నప్పుడు సాధారణ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేలు కావచ్చని, ఆమె ఉన్నంతవరకూ అందరూ ప్రశాంతంగా ఉండేవారని, భయంతో మెలిగేవారన్నారు. జయలలిత మృతి తర్వాత తన దగ్గర కూడా పార్టీ శ్రేణులంతా భయంతోనే ఉండేవారని, చివరకు తాను బెంగళూరు జైలులో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నాడీఎంకే ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలలో భయం పోయిందని, క్రమశిక్షణ లేకుండా పోయిందని, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు
Read Latest Telangana News and National News