ఆటోలో రజనీకాంత్.. షాక్ అయిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:00 PM
‘నేను ఆటో వాణ్ని.. ఆటో వాణ్ని’ అనే రజనీకాంత్ పాట చాలామందికి ఇష్టం.. అయితే ఆ పాటను గుర్తుచేసేలా ఓ సినిమా షూటింగ్‌కు రజనీకాంత్ ఆటోలోనే వెళ్లారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ధర్మన్ అనే సినిమా షూటింగ్‌కు ఆయన ఆటోలో వెళ్లారు. ఇది చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ధర్మన్ చిత్రీకరణ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం రజనీకాంత్ వస్తారని, అభిమానులు గేట్ల వద్ద ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఆయన ఒక ఆటోలో అక్కడికి వచ్చి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అనంతరం రజనీకాంత్ అభిమానులను పలకరించి సెట్స్‌కు వెళ్లిపోయారు.
అయితే దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. కాగా రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ధర్మన్’ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గత జూన్‌లో విడుదలైన ‘ధర్మన్’ ఫస్ట్‌లుక్‌తో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
ఈ వార్తలూ చదవండి
Aadarsa Kutumbam: 'నారాయణమ్మ..' పాటకు స్ఫూర్తి అదేనా!?
Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది