Share News

సుప్రీంకోర్టుకు మార్చ్‌గా తరలిరండి: యువతకు రాహుల్ పిలుపు

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:31 PM

యువతపై బీజేపీ గూండాలు భౌతిక దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రేపు సుప్రీంకోర్టుకు తరలిరావాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక వీడియోను ఆయన విడుదల చేశారు.

సుప్రీంకోర్టుకు మార్చ్‌గా తరలిరండి: యువతకు రాహుల్ పిలుపు

ఇంటర్‌నెట్ డెస్క్: యువతపై బీజేపీ గూండాలు భౌతిక దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రేపు సుప్రీంకోర్టుకు తరలిరావాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. రేపు సుప్రీంకోర్టుకు మార్చ్‌గా కాంగ్రెస్ ,ఇండియా కూటమి నేతలు తరలివెళ్తారని తెలిపారు. ‘‘యువకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, ఎటువంటి ద్వేషం లేకుండా, కేవలం ప్రేమతో వ్యక్తపరచాలనుకుంటున్నారు. కానీ, బీజేపీ గూండాలు, పోలీసులు వారిని అణచివేసి దాడులు చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని సమర్థించే ప్రతిఒక్కరూ ఎలాంటి రాజకీయ పార్టీలు, కుల మతాల భేదాలు లేకుండా సోమవారం సుప్రీంకోర్టుకు తరలిరావాలి’’ అని ఆయన కోరారు.


ఓట్ల చోరీని అరికట్టడం, సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానం (ఈఎస్ఐఆర్) లో సమస్యలను పరిష్కరించడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎం) తొలగించడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొలగింపు వంటి డిమాండ్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రేపు వినతిపత్రం అందజేయనున్నామని వెల్లడించారు. మనమంతా సంఘటితంగా ఉంటే దేశద్రోహులు ఎవరూ మనపై దాడి చేయలేరని అన్నారు. దేశ ప్రజలందరూ ప్రేమ, సోదరభావం, దేశభక్తితో ఐక్యంగా ఉండి, భయపడకుండా నిలబడితే ఇటువంటి అరాచక శక్తులు తలవంచక తప్పదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలూ చదవండి

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!

ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు

Updated Date - Oct 11 , 2026 | 09:31 PM