Share News

గ్రోక్‌లో క్రెడిట్ కార్డులు అప్‌లోడ్ చేసి షాపింగ్ చేయండి: మస్క్

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:36 PM

ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఓ ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యూజర్లు తమ క్రెడిట్ కార్డులను గ్రోక్‌లో అప్‌లోడ్ చేసి షాపింగ్ చేయాలని ఆయన సూచించారు. వారు ఆవిధంగా చేస్తే, యూజర్ల తరపున గ్రోక్ బెస్ట్ డీల్స్‌ను ఆర్డర్ చేస్తుందని తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు.

గ్రోక్‌లో క్రెడిట్ కార్డులు అప్‌లోడ్ చేసి షాపింగ్ చేయండి: మస్క్

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఓ ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యూజర్లు తమ క్రెడిట్ కార్డులను గ్రోక్‌లో అప్‌లోడ్ చేసి షాపింగ్ చేయాలని ఆయన సూచించారు. వారు ఆవిధంగా చేస్తే, యూజర్ల తరపున గ్రోక్ బెస్ట్ డీల్స్‌ను ఆర్డర్ చేస్తుందని తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. తాను చేసిన ఆ ప్రతిపాదన ఎలా పనిచేస్తుందో ఆయన వివరించారు. ‘‘మీరు చేయాల్సిందేమీ లేదు. సింపుల్‌గా మీ క్రెడిట్ కార్డుని ఫొటో తీయండి. దానిని గ్రోక్‌లోకి అప్‌లోడ్ చేయండి. అంతే, మీకు కావాల్సిన బెస్ట్ డీల్స్‌ను గ్రోక్ చాట్‌బాటే వెతికిపెడుతుంది’’ అని మస్క్ ట్వీట్ చేశారు. అలాగే, మరో నోట్‌ను కూడా మస్క్ షేర్ చేశారు. ‘‘ప్రాంప్ట్‌లలో వ్యక్తిగత సమాచారం పెట్టకూడదని ఏఐలు యూజర్లకు సాధారణంగా హెచ్చరికలు చేస్తుంటాయి. క్రెడిట్ కార్డ్ ఫొటోల్లో కీలక సమాచారం ఉంటుంది. తన క్లౌడ్ ఎన్విరాన్‌మెంట్లలో యూజర్ డేటా, క్రెడెన్షియల్ స్టోర్ అయ్యే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కోసం ఒకసారి రివ్యూ చేసుకోవాలని గ్రోక్ చాట్‌బాట్లకు చెందిన నిబంధనలు సూచిస్తున్నాయి’’ అని ఆ నోట్‌లో పేర్కొన్నారు.


మస్క్ ప్రతిపాదనలపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ప్రతిపాదనలో ప్రైవసీ, భద్రతాపరమైన ముప్పు ఉందని పేర్కొన్నారు. ఏఐ చాట్‌బాట్లకు ఫైనాన్షియల్ డేటాను ఇవ్వడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో యూజర్ల సున్నిత సమాచారం స్టోర్ చేయడం ఎప్పటికీ మంచిది కాదన్నారు. మస్క్ ప్రతిపాదనకు ఓపెన్ ఏఐ ఎగ్జిక్యూటివ్ టిబో ప్రాక్టికల్‌గా స్పందించారు. ఒక ఫిక్షనల్ క్రెడిట్ కార్డును ఆయన గ్రోక్‌లో షేర్ చేశారు. ఆ ఫీచర్ వల్ల భద్రతా ముప్పు ఎలా ఉంటుందో వివరించారు. ఏఐ చాట్‌బాట్లలో వ్యక్తిగత సమాచారం ఉంచితే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారో పలు యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.


అయితే, సెక్యూరిటీ ముప్పు నేపథ్యంలో ఒక యూజర్ ఓ సూచన చేశారు. క్రెడిట్ కార్డు వివరాలను షేర్ చేయాలని యూజర్లను అడిగే బదులు సింగిల్ యూజ్ వర్చువల్ కార్డ్ నంబర్లను జనరేట్ చేసేలా ఏఐ షాపింగ్ టూల్స్ తయారు చేస్తే బాగుంటుందని ఆ యూజర్ ప్రతిపాదించారు. ముందుగా ఎలాన్ మస్కే తన సొంత క్రెడిట్ కార్డును గ్రోక్‌లో షేర్ చేయాలని మరో యూజర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. గ్రోక్ యాక్సెస్‌ను అమెజాన్ సంస్థ బ్లాక్ చేయడం ప్రారంభించిందని ఒక వినియోగదారుడు చేసిన వ్యాఖ్యపై మస్క్ స్పందించారు. కొనుగోళ్లను పూర్తి చేయడానికి గ్రోక్ చాట్‌బాట్ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొంటుందని ఆయన పేర్కొన్నారు. తాను ఇటీవల గ్రోక్ ద్వారా కొన్ని లెగో ఉత్పత్తులను ఆర్డర్ చేశానని, అది నేరుగా లెగో అధికారిక వెబ్‌సైట్ నుంచే ఆ లావాదేవీని పూర్తి చేసిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

బీసీసీఐకి గంభీర్‌ హెచ్చరిక.. పిచ్‌లు మారకపోతే భారత క్రికెట్‌కు నష్టమే!

ఆటగాళ్ల మార్పులే అసలు సమస్య.. గంభీర్‌పై సీఎస్కే మాజీ స్టార్ విమర్శలు

Updated Date - Oct 11 , 2026 | 07:03 PM