Share News

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే వారందరూ ఢిల్లీ మార్చ్‌కు రావాలి: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:24 PM

ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే మెగా మార్చ్‌కు అందరూ తప్పకుండా రావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా కోరారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే వారందరూ ఢిల్లీ మార్చ్‌కు రావాలి: రాహుల్ గాంధీ
rahul gandhi post on x

ఇంటర్నెట్ డెస్క్: ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే మెగా మార్చ్‌కు అందరూ తప్పకుండా రావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా కోరారు. ఇది ఒక రాజకీయ పార్టీ నడిపే మార్చ్ కాదని.. భారతదేశ ఆత్మ తరఫున నిర్వహిస్తున్న మార్చ్ అని రాహుల్ అన్నారు.


‘ఓట్ చోరీని అడ్డుకోవడానికి ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నవంబర్ 1న మెగా మార్చ్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మార్చ్‌లో పాల్గొనాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న మార్చ్ కాదు. భారతదేశ ఆత్మ తరఫున నిర్వహిస్తున్న మార్చ్. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లతో విసిగిపోయిన వారందరూ.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే వారందరూ ఈ మార్చ్‌లో పాల్గొనాలి. ఇది దేశం మొత్తం తెలిపే నిరసన. పోలీసుల లాఠీలకు భయపడకండి. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి సంఘం ఈ మార్చ్‌లో పాల్గొనాలి. మీ ఆలోచనలు, వ్యక్తీకరణపై దాడి జరుగుతోందని భావిస్తే తప్పకుండా రండి’ అంటూ రాహుల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Updated Date - Oct 29 , 2026 | 02:10 PM