Share News

‘విద్యార్థుల నిరసనపై కేంద్రం మూర్ఖంగా వ్యవహరించింది’.. లోక్‌సభలో రాహుల్ గాంధీ

ABN , Publish Date - Jul 29 , 2026 | 01:16 PM

లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిల్లుపై మాట్లాడుతూ.. పేపర్ లీక్‌పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు, వారి పిల్లలను అడగాలంటూ వ్యాఖ్యానించారు.

‘విద్యార్థుల నిరసనపై కేంద్రం మూర్ఖంగా వ్యవహరించింది’.. లోక్‌సభలో రాహుల్ గాంధీ
Rahul Gandhi

న్యూఢిల్లీ, జులై 29: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిల్లుపై మాట్లాడుతూ.. పేపర్ లీక్‌పై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బీజేపీ నేతలు, వారి పిల్లలను అడగాలంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని.. భావ వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు.


విద్యార్థుల ఆందోళనను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గౌరవించాలని రాహుల్ పిలుపునిచ్చారు. తీవ్ర వేదన తర్వాతే విద్యార్థులు ఆందోళన చేశారని.. కానీ వారి నిరసనను కేంద్రం అర్థం చేసుకోలేదని విమర్శించారు. వారి ఆవేదనను పట్టించుకోలేదనే విద్యార్థులు రోడ్లపైకి వచ్చారని వివరించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, హింసించారని మండిపడ్డారు. పేపర్ లీక్ వార్తతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని.. వారి ఆవేదనను అర్థం చేసుకున్నందునే వారి పక్షాన మాట్లాడుతునట్లు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.


రాహుల్ ప్రసంగంపై బీజేపీ ఎంపీల అభ్యంతరం..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. విద్యార్థుల ఆందోళన అంశంపై సభలో ప్రసంగించిన ఆయన.. ఆర్‌ఎస్‌ఎస్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఓ పదం వివాదాస్పదంగా మారింది. దీనిపై అధికార పక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో నిరసన తెలిపారు. రాహుల్‌ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. రాహుల్ తన భాషను మార్చుకోవాలని కిరణ్ రిజిజు అన్నారు. విద్యార్థుల పేరుతో అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కిరణ్‌ రిజిజు డిమాండ్ చేశారు. దీంతో ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.


కావాలనే నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు: రాహుల్

బీజేపీ ఎంపీల వ్యాఖ్యలపై రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను ఎంపీలను విమర్శించలేదు. బీజేపీ ఎంపీలు కావాలనే నా ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు. సభలో కేవలం బీజేపీ ఎంపీలే మాట్లాడాలనడం సరికాదు’ అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

హాట్‌స్పాట్‌లపై ఫోకస్ పెట్టండి.. అధికారులకు జలమండలి ఎండీ ఆదేశాలు

బంగాళాఖాతంలో మునిగిన వాళ్లే హైడ్రాను ముంచుతామంటారా?’.. కేటీఆర్‌పై తుమ్మల సెటైర్

Read Latest National News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 03:52 PM