జంతర్‌మంతర్ వద్ద ఆంక్షలు, సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ప్రకాష్ రాజ్ ఆగ్రహం..
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:48 PM
దేశ రాజధానిలోని చారిత్రాత్మక నిరసన వేదిక అయిన జంతర్‌మంతర్‌పై విధించిన ఆంక్షలు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యుల అరెస్ట్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధానిలోని చారిత్రాత్మక నిరసన వేదిక అయిన జంతర్‌మంతర్‌పై విధించిన ఆంక్షలు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సభ్యుల అరెస్ట్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ జెండాతో జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించిన సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను పోలీసులు అరెస్టు చేసి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాడు. దీనిపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును, జంతర్‌మంతర్‌ను నిరసన వేదికగా డీనోటిఫై చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. ప్రభుత్వాలు నిరసన వేదికలను మార్చగలవేమో కానీ, ఈ దేశ ప్రజల గొంతును ఎప్పటికీ అణచివేయలేవని అతడు హెచ్చరించారు. ' నిరసన వేదికను మార్చవచ్చు. నిరసలను ఆపొచ్చు.. కానీ ఈ దేశ ప్రజల గొంతును ఎవరూ ఆపలేరు. కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా ఇప్పుడు దేశమంతా జంతర్‌మంతర్‌గా మారుతుంది' అంటూ ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్రజలు నిత్యం ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటారని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలను ప్రజలు సహించబోరని ప్రకాశ్ రాజ్ వెల్లడించాడు. గతంలో బెంగళూరులో జరిగిన సీజేపీ నిరసన కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యమయ్యానని గుర్తుచేస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళం విప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డాడు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గతకొన్ని రోజులుగా సీజేపీ, ఇండియా కూటమి నేతలు ఆందోళనలు చేస్తున్నా సంగతి తెలిసిందే. వీరి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యువత ఢిల్లీ, ఇతర నగరాల్లో నిరసనలు తెలుపుతున్నారు
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి