మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్: ఈసీ
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:17 PM
అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 09: అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
గురువారం ఉదయం అసోం (126), కేరళం (140), పుదుచ్చేరి (30) లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ ఎన్నికల పోలింగ్ వేళ.. ఏర్పాట్లను ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఆయా రాష్ట్రాలోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది మార్చి రెండో వారంలో దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒక దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. మే 4వ తేదీన ఈ ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడతామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల బరిలో మమతా బెనర్జీ.. ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మల్టీ నేషనల్ కంపెనీలో లైంగిక వేధింపులు.. ఆరుగురి అరెస్టు..
Read Latest National News And Telugu News