ఏబీఎన్ ఎండీపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:12 PM
అవినీతి డబ్బుతో జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేమూరి రాధాకృష్ణ పత్రిక పెట్టుకోలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారని మంత్రి తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 9: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ‘పత్రిక గురించి మాట్లాడుతున్నావు.. నీ భార్య కూడా పత్రికా అధిపతే’ అని తెలిపారు. అవినీతి డబ్బుతో జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేమూరి రాధాకృష్ణ(ABN Andhrajyothy MD Vemuri Radhakrishn) పత్రిక పెట్టుకోలేదన్నారు. రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న వాస్తవాలను రాధాకృష్ణ ప్రజల ముందుంచారని వెల్లడించారు. ప్రజలను చైతన్య పరచడానికి రాధాకృష్ణ మాట్లాడారని అన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేకపోతే కోర్టులను ఆశ్రయించాలన్నారు. సాక్షి టీవీలో అమరావతి మహిళలను వ్యభిచారులతో పోల్చలేదా అని ప్రశ్నించారు. నారా భువనేశ్వరి గురించి అసెంబ్లీలో విమర్శిస్తే దుర్యోధనుడిలా చూస్తూ కూర్చున్నావంటూ జగన్‌పై మండిపడ్డారు. టీడీపీతో పాటు అమరావతి మహిళలను మాటలతో వేధించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ చనిపోయినప్పుడు ఎక్కడున్నావ్...
2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంపై జగన్‌కు ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఎన్డీఏపై అచంచల విశ్వాసంతో ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. 22 నెలల్లోనే కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని చెప్పారు. 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారని... నాడు వారి ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. వైఎస్సార్‌ను జగన్ మానసిక క్షోభకు గురిచేసినట్లు చెప్పారు. వైఎస్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘వైఎస్సార్ ఆచూకీపై అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం పదవి కోసం జగన్ పాకులాడతారా? ఏం జరిగిందో నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు సేకరిస్తారా? ఇతర రాష్ట్రాల్లో జగన్ ఉండాల్సిన అవసరం ఏంటి?’ అంటూ మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు.
జగన్‌కు పదవి తప్ప మరో ఆలోచన లేదు..
బాబాయిని కిరాతకంగా చంపింది జగన్ కాదా అని మంత్రి నిలదీశారు. తల్లి, చెల్లిని రోడ్డున పడేసిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. పదవి గురించి తప్ప.. జగన్‌కు మరో ఆలోచన లేదని విమర్శించారు. వైఎస్ మృతిలోనూ జగన్ పాత్ర ఉందన్న అనుమానాలున్నాయని తెలిపారు. సైకోకు పదవి ఇస్తే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందన్నారు. తన తండ్రి మరణానికి కారణం అని చెప్పి ఆనాడు రిలయన్స్ ఏజెన్సీలపై జగన్ దాడులు చేయించారని.. మళ్లీ అదే రిలయన్స్ వ్యక్తికి రాజ్యసభ స్థానం కేటాయించారన్నారు. వైఎస్సార్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని బొత్స సత్యనారాయణనే మాట్లాడారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గత పాలకుల పనులు చూసి నాకే మతిపోయింది: సీఎం చంద్రబాబు
తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telugu News