మహిళా రిజర్వేషన్‌తో కొత్త యుగం ప్రారంభం: ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:20 PM
భారత నారీ శక్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కలను సాకారం చేశామని ప్రధాని ప్రకటించారు.
ఢిల్లీ, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): భారత నారీ శక్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కలను సాకారం చేశామని ప్రకటించారు. శాసనసభలు, పార్లమెంటులో మహిళల భాగస్వామ్యం దేశ భవిష్యత్తును మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లు చట్టం మాత్రమే కాదని, దేశ నిర్మాణంలో మహిళలకు లభించిన గౌరవమని వెల్లడించారు. మహిళల అభివృద్ధి నుంచి 'మహిళల నేతృత్వంలోని అభివృద్ధి' దిశగా భారత్ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశం 'వికసిత్ భారత్'గా మారడంలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. ఈ చారిత్రక మార్పును స్వాగతిస్తున్న భారత నారీ శక్తికి ప్రధాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లు చట్టం అమలు చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీలిమిటేషన్‌తో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి
లవ్ జిహాద్ కేసుపై బండి సంజయ్ ఘాటు స్పందన
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News