యోగా ప్రపంచాన్ని కలిపింది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:31 AM
యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అందరినీ ఏకం చేస్తుందని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అందరినీ ఏకం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తెచ్చిందని పేర్కొన్నారు. కోల్‌కతాలో అంతర్జాతీయ యోగా డే వేడుకలని ఈరోజు(ఆదివారం) నిర్వహించారు. యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
35వేల మందితో రికార్డు స్థాయిలో కోల్‌కతాలో యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. యోగా కార్యక్రమాలతో దేశమంతా చైతన్యం నిండిపోయిందని తెలిపారు. యోగా కేవలం శారీరక శ్రమకే పరిమితం కాదని చెప్పుకొచ్చారు. జీవనశైలి వ్యాధుల నుంచి నివారించడానికి యోగా ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News