నితీశ్ సేతు బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:26 PM
ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లోని వైశాలి జిల్లాలో కచ్చీ దర్గా-రాఘవ్‌పూర్-బిడుపుర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆరు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జికి బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ గౌరవార్థం ‘నితీశ్ సేతు’ అని పేరుపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లోని వైశాలి జిల్లాలో కచ్చీ దర్గా-రాఘవ్‌పూర్-బిడుపుర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆరు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జికి బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ గౌరవార్థం ‘నితీశ్ సేతు’ అని పేరుపెట్టారు. బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ చౌధరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిడ్జిని ప్రారంభించాక వారంతా మోదీతో కలిసి నడిచారు.
రూ.4,280 కోట్లతో నిర్మాణం
నితీశ్ సేతు బ్రిడ్జిని రూ.4,280 కోట్లతో గంగా నదిపై నిర్మించారు. పూర్తిగా కేబుళ్లతో దీనిని కట్టారు. దీని పొడవు 19.7 కిలోమీటర్లు. పట్నా జిల్లాలోని జాతీయ రహదారి 22పై ఉన్న కచ్చీ దర్గాను వైశాలి జిల్లాలోని జాతీయ రహదారి 322పై ఉన్న బిడుపుర్‌తో ఈ బ్రిడ్జి కలుపుతుంది. అంటే పట్నా, వైశాలిని ఇది అనుసంధానిస్తుంది. ఇందులో 9.7 కిలోమీటర్లు మెయిన్ బ్రిడ్జి కాగా.. 10 కిలోమీటర్లు అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. ఈ బ్రిడ్జితో ప్రయాణ సమయం 20 నుంచి 25 నిమిషాలకు తగ్గుతుంది. ప్రముఖ సంస్థ లార్సెన్ అండ్ ట్యూబ్రో, దక్షిణ కొరియా కంపెనీ డైవూ కలిసి ఈ బ్రిడ్జిని నిర్మించాయి.
నితీశ్‌ను కలవడం ఆనందంగా ఉంది: మోదీ
నితీశ్ సేతు బ్రిడ్జిని ప్రారంభించేందుకు పట్నా ఎయిర్‌పోర్టు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని బిహార్ మాజీ సీఎం నితీశ్ కమార్ రిసీవ్ చేసుకున్నారు. నితీశ్‌ను కలవడం తనకు ఆనందంగా ఉందని మోదీ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఫొటోలు షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు