మేనరికం పెళ్లిళ్లు ఇంకా కొనసాగాలా?
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:19 AM
సంప్రదాయం పేరుతో రక్త సంబంధీకుల మధ్య వివాహాలను ఇంకా కొనసాగించాల్సి ఉందా అని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలయింది
పిల్లల్లో జన్యులోపాల దృష్ట్యా ఆపితే మేలంటూ పిటిషన్
నిషేధించలేకున్నా అవగాహన కల్పించాలన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 20: సంప్రదాయం పేరుతో రక్త సంబంధీకుల మధ్య వివాహాలను ఇంకా కొనసాగించాల్సి ఉందా అని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలయింది. దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరుగుతుండడంతో పిల్లలు జన్యుపర లోపాలతో పుడుతున్నారని, అందువల్ల వీటిని నిషేధించేలా చట్టం తీసుకొస్తే మంచిదని కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయ విద్యార్థి చార్వీ.ఎస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లిదండ్రులది కూడా మేనరికమేనని, తాను ఇప్పుడు 40ు అంధత్వంతో బాధపడుతున్నానని చెప్పారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం వీటిని అడ్డుకునేందుకు చట్టం చేయాలంటూ ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ఇలాంటి వివాహాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించింది. అయినా వివాహాలు వ్యక్తిగతమని, ఎయిడ్స్ సోకిన వారిని కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు