సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృ వియోగం
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:23 AM
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీదేవి(91) కన్నుమూశారు.
91 ఏళ్ల వయసులో కన్నుమూసిన సావిత్రీదేవి
లఖ్‌నవూ/పౌరీ గర్వాల్, నవంబరు 20: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీదేవి(91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్వగ్రామమైన ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్‌లో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహించే అవకాశం ఉంది. అంత్యక్రియల్లో యోగి పాల్గొననున్నారు. సావిత్రీదేవికి ఏడుగురు సంతానం. కాగా, యోగి ఆదిత్యనాథ్ రెండో కుమారుడు. ఆయన తండ్రి ఆనంద్‌సింగ్ బిస్త్ 2020లో అనారోగ్యంతో మరణించినప్పుడు కరోనా లాక్‌డౌన్, సీఎం బాధ్యతల కారణంగా తండ్రి అంత్యక్రియలకు యోగి హాజరుకాలేకపోయారు. సావిత్రీదేవి మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం రేవంత్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం
ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు