నోయిడాలో అగ్నిప్రమాదం.. ఐదు దుకాణాల్లో చెలరేగిన మంటలు, ఒకరి మృతి
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:54 PM
ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నోయిడాలోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మరో నాలుగు దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో శనివారం అగ్నిప్రమాదం చోటుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని రాయ్‌పూర్‌లోని 126వ సెక్టార్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాల్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా.. ఘటనాస్థలంలో ఓ వ్యక్తి సృహ కోల్పోయి కనిపించడంతో.. అగ్నిమాపక సిబ్బంది బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా.. అప్పటికే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.