Share News

భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం

ABN , Publish Date - Jul 06 , 2026 | 06:15 PM

రాష్ట్రపతి భవన్‌లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్‌తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భేటీ అయ్యారు.

భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం
India AND Bahamas Relations

ఢిల్లీ, జులై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి భవన్‌లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్‌తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్‌లతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఈరోజు (సోమవారం) భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బహామాస్ హైకమిషనర్ దౌత్య పత్రాల (Credentials) కార్యక్రమం జరిగింది. బహామాస్ కొత్త హైకమిషనర్ పీటర్ నికోలస్ సైమొనెట్ నుంచి దౌత్యపత్రాలను ముర్ము స్వీకరించారు.


వాణిజ్యం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో.. భారత్-బహమాస్ మధ్య సహకారం మరింత బలోపేతం కానుంది. విద్య, సామర్థ్య పెంపు రంగాల్లో కలిసి ఇరుదేశాలు పనిచేయనున్నాయి. కరేబియన్ దేశాలతో దౌత్యపరమైన బంధం మరింత బలోపేతం కానుంది. అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని ఇరుదేశాల నిర్ణయం తీసుకున్నాయి. బహమాస్‌, మొజాంబిక్, నికరాగ్వా, సురినామ్.. గబాన్ రిపబ్లిక్ మంగోలియా రాయబారుల నుంచి దౌత్య పత్రాలు స్వీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 07:04 PM