ముంబైలో ఉద్రిక్తత.. నటుడు ఇమ్రాన్ ఖాన్‌తో సహా 400 మందికి పైగా ఆందోళనకారుల అరెస్టు!
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:18 PM
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసనలకు మద్దతుగా ముంబైలో చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నిరసనల్లో...
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసనలకు మద్దతుగా ముంబైలో చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు అనుమతి లేకుండా నగరంలోని ఆగస్ట్ క్రాంతి మైదానం, ఇతర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో 400 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు.
నేషనల్ క్యాపిటల్‌లో జరుగుతున్న సీజేపీ ఆందోళనకు సంఘీభావంగా ముంబైలో ఈ నిరసనలు చేపట్టారు. శుక్రవారం రోజు ఉదయం సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ నేతృత్వంలోని 'హం భారత్ కే లోగ్' సంస్థ సభ్యులు, సీపీఐ(ఎం) కార్యకర్తలు సహా దాదాపు 200 మందిని పోలీసులు ఇదే ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచీత్ బహుజన్ అఘాడి (VBA) కార్యకర్తలు కూడా సీజేపీకి మద్దతుగా దక్షిణ ముంబైలోని హుతాత్మా చౌక్ వద్ద ఆందోళన చేశారు. అనుమతి లేకుండా నిరసనలు చేపట్టిన వారందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు