Share News

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. బెస్ట్ డిపోలో 10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం

ABN , Publish Date - Oct 05 , 2026 | 08:34 PM

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ప్రాంతంలో ఉన్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు డిపోలో ఇవాళ(సోమవారం) సాయంత్రం భారీగా మంటలు ఎగసి పడ్డాయి.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. బెస్ట్ డిపోలో 10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం
Mumbai Fire

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ప్రాంతంలో ఉన్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు డిపోలో ఇవాళ(సోమవారం) సాయంత్రం ఈ ఘటన జరిగింది. అనిక్ డిపో యార్డ్‌లో సాయంత్రం సుమారు 5:45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డిపోలో నిలిపి ఉంచిన 10 సీఎన్‌జీ బస్సులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.


మంటల ధాటికి బస్సులలోని సిఎన్‌జి సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయని, పరిసర ప్రాంతాల్లో దట్టమైన నల్లటి పొగ ఆవరించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయపడటం గానీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలూ చదవండి

వెస్టిండీస్‌తో తొలి టీ20: అర్ష్‌దీప్ రీఎంట్రీ.. సంజు ఔట్!

టీమిండియా ఇప్పుడు షమీ వైపు చూడటంలో అర్థం లేదు: దినేశ్ కార్తీక్

Updated Date - Oct 05 , 2026 | 08:34 PM