Share News

బీజేపీ వచ్చి నిషేధించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:48 PM

ట్రిపుల్ తలాక్ అంశంపై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ప్రశ్నలు లేవనెత్తారు. సామాజిక, మతపరమైన సంస్కరణలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ముస్లిం సమాజంలోని సంస్కరణలు వేరే వాళ్లు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

బీజేపీ వచ్చి నిషేధించాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..
Javed Akhtar

ఇంటర్నెట్ డెస్క్: ట్రిపుల్ తలాక్ అంశంపై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ప్రశ్నలు లేవనెత్తారు. సామాజిక, మతపరమైన సంస్కరణలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ముస్లిం సమాజంలోని సంస్కరణలు వేరే వాళ్లు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు చట్టం తీసుకురావాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు (Javed Akhtar triple talaq).


ముస్లిం పర్సనల్ లా 1937లో అమల్లోకి వచ్చిందని, 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దానిలో అవసరమైన మార్పులు ఎందుకు చేయలేదని జావేద్ ప్రశ్నించారు. సామాజిక సంస్కరణలు ముందుగా సమాజంలో నుంచే రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి చట్టం వచ్చే వరకు ట్రిపుల్ తలాక్ ఎందుకు కొనసాగిందని ప్రశ్నించారు. తన వాదనకు ఉదాహరణగా జావేద్, హిందూ చట్టాల్లో జరిగిన సంస్కరణలను కూడా ప్రస్తావించారు (Muslim personal law).


1956లో హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చిన సమయంలో సాంప్రదాయవాద వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఆయన పేర్కొన్నారు (Secular Muslim leaders). మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే విషయంలో కూడా చాలాకాలం వ్యతిరేకత ఉందని, అయినా చట్టపరమైన మార్పులు జరిగాయని ఆయన గుర్తుచేశారు. తాను ముస్లిం కుటుంబంలో జన్మించిన నాస్తికుడినని పేర్కొన్న ఆయన.. ముందుగా తన సమాజంలోని సమస్యలను ప్రశ్నించడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..


మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 05 , 2026 | 07:49 PM