రెండు రాష్ట్రాల జాబితాలో టాపర్‌గా ధోని
ABN , Publish Date - May 08 , 2026 | 03:38 PM
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని క్రికెట్‌లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా ధోని నిలిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని క్రికెట్‌లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా ధోని నిలిచాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుడిగా రికార్డు సృష్టించాడు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలు కలిపి సుమారు రూ. 20,000 కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ వసూలు చేశాయి. ఇందులో రూ.12,000 కోట్లు ఒక్క ఝార్ఖండ్ రాష్ట్రం నుంచే వసూలు అయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కువగా వ్యక్తిగత పన్ను చెల్లించిన వ్యక్తిగా ధోని నిలిచాడు. ఈ విషయాన్ని బిహార్-ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డా. డి. సుధాకర రావు వెల్లడించారు. కార్పొరేషన్లలో సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) మరియు CMPDI అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఉన్నాయి.
ధోని ఎంత పన్ను చెల్లించాడన్న వివరాలను అధికారికంగా వెల్లడించకపోయినా, అతని ఆస్తులు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఆధారంగా సుమారు రూ.38 కోట్ల పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ధోని నికర సంపద 2026 మే నాటికి సుమారు రూ.1,060 కోట్లు ఉంటుందని అంచన. టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాల్లో కార్స్24, గరుడ ఏరోస్పేస్, ఖటాబుక్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్‌గా, ఇన్వెస్టర్‌గా ధోని ఉన్నాడు. అలానే వివిధ వనరుల ద్వారా సంవత్సరానికి సుమారు రూ.75 కోట్లు సంపాదిస్తున్నాడు. ధోని పేరిట రాంచీలో 7 ఎకరాల్లో ఓ లగ్జరీ ఇళ్లు ఉంది. 100కి పైగా వింటేజ్, మోడరన్ బైకులు ఉన్నాయి. వీటన్నటి కోసం ఓ గాజు గోడల గ్యారేజీ ఉంది. అలాగే 43 ఎకరాల ఫామ్‌ను నిర్వహిస్తూ వాణిజ్యపరంగా కూరగాయలు సాగు చేస్తున్నాడు.
పన్ను చెల్లించే టాప్ భారతీయ క్రికెటర్లు వీరే..
(2023-24 FY ఆధారంగా)
విరాట్ కోహ్లీ : రూ. 66 కోట్లు
ఎంఎస్ ధోని : రూ.38 కోట్లు
సచిన్ టెండూల్కర్ : రూ. 28 కోట్లు
సౌరవ్ గాంగూలీ : రూ. 23 కోట్లు
హార్దిక్ పాండ్య : రూ13 కోట్లు
ఇవి కూడా చదవండి:
21 ఏళ్లకే వైభవ్ రిటైరవుతాడు.. ఇంగ్లండ్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026: జట్టుతో కలిసిన ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య