21 ఏళ్లకే వైభవ్ రిటైరవుతాడు.. ఇంగ్లండ్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - May 08 , 2026 | 02:58 PM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంగ్లండ్ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్‌పై ఓ సరదా కామెంట్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజాలకు సైతం సాధ్యం కానీ పలు రికార్డులను ఈ యువ సంచలనం నమోదు చేశాడు. 15 ఏళ్ల వయసుకే దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లీగ్‌లో వైభవ్‌ను ఆపడం అసాధ్యంగా కనిపిస్తుంది. త్వరలో వైభవ్‌ను టీమిండియాకు ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంగ్లండ్ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్‌పై ఓ సరదా కామెంట్ చేశాడు.
‘స్టిక్ టు క్రికెట్’ అనే పాడ్‌కాస్ట్‌లో టఫ్నెల్ మాట్లాడుతూ... వైభవ్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌నే కొనసాగిస్తే 21 ఏళ్లకే బర్నౌట్ అవుతాడని అన్నాడు. ఆ వయసుకే కావాల్సినంత డబ్బు సంపాదించుకొని రిటైరవుతాడంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా వైభవ్ ఐపీఎల్ 2026 ప్రదర్శనలను కొనియాడాడు. 'స్టిక్ టూ క్రికెట్' షోలో టఫ్నెల్‌తో పాటు మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్ లాంటి ఇతర ఇంగ్లండ్ దిగ్గజాలు పాల్గొన్నారు. వారి ముందే వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
తరుచూ భార క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కే మైఖేల్ వాన్ కూడా వైభవ్‌ను ప్రశంసించడం గమనార్హం. క్రిస్ గేల్ లాంటి విధ్వంసకర ఆటగాడు కెరీర్ మధ్యలో 30 బంతుల్లో సెంచరీ చేస్తే.. వైభవ్ 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో శతకం చేశాడంటూ వాన్ కొనియాడాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లు కొట్టి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడంటూ వాన్ ప్రశంసించాడు. వైభవ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ సిక్సర్ల హిట్టర్ అంటూ మరో ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్ ఆకాశానికెత్తాడు. మొత్తంగా మొట్టమొదటి సారి ఇంగ్లండ్ దిగ్గజాలంతా వైభవ్‌ను ముక్తకంఠంతో కొనియాడటం విశేషం.
ఇవి కూడా చదవండి:
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్