Share News

మోహన్‌లాల్‌కు వీసా చిక్కులు.. సిడ్నీ షో వాయిదా!

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:16 PM

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయనకు ఆస్ట్రేలియా వీసా మంజూరు కాకపోవడంతో సిడ్నీలో శనివారం జరగాల్సిన లైవ్‌ షో వాయిదా పడింది.

మోహన్‌లాల్‌కు వీసా చిక్కులు.. సిడ్నీ షో వాయిదా!
Mohanlal

ఇంటర్నెట్ డెస్క్: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయనకు ఆస్ట్రేలియా వీసా మంజూరు కాకపోవడంతో సిడ్నీలో శనివారం జరగాల్సిన లైవ్‌ షో వాయిదా పడింది. నార్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా 'వైకిట్టు ఎంధా పరిపాడి(ఈ సాయంత్రం ఏంటి కార్యక్రమం?)' పేరిట ఈ షో జరగాల్సి ఉంది. మోహన్‌లాల్‌ సహా పలువురు కళాకారులూ ఇందులో పాల్గొనాల్సి ఉంది.


ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న మోహన్‌లాల్ ఆస్ట్రేలియా వీసా కోసం ఎదురుచూశారు. ఆయన బృందంలోని పలువురు సభ్యులు ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారు. అయితే.. ఆయన వీసా సకాలంలో రాకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ విషయమై మోహన్‌లాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'ఈ పరిణామం నన్ను ఎంతో బాధించింది. ఇలా ఎలా జరిగిందో నాకు తెలియదు. సాంకేతిక లోపమా లేక క్లరికల్‌ తప్పిదమేమైనా అయ్యుండొచ్చు. దీనిపై మరింత వివరాల్లోకి వెళ్లడం లేదు. ఈ పరిస్థితికి బాధ్యత నాదే' అని సింగపూర్ నుంచే ఓ వీడియోను పోస్ట్ చేశారు. తనను నమ్మి కార్యక్రమానికి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు క్షమాపణలు కూడా తెలిపారు.


ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేదని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైందని కాకుండా.. అనుమతి ప్రక్రియలో జాప్యం మాత్రమే జరిగిందని నిర్వాహకులు స్పష్టం చేసినట్లు సమాచారం.


ఇవీ చదవండి:

చైనాలో కొత్త విధానం.. ఉద్యోగులకు ఏటా 10 రోజుల 'అన్‌హ్యాపీ లీవ్స్'

అయ్‌బాబోయ్! ఆమె జడ ఎంత పొడుగో.. గిన్నిస్ రికార్డ్ దాసోహమాయె.!

Updated Date - Aug 08 , 2026 | 06:12 PM