విజయ్.. నువ్వు ఆరెస్సెస్ దత్త పుత్రుడివి.. డీఎంకే విమర్శ
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:12 PM
తమిళనాడులో ఇప్పుడు ఓ చేతి సంజ్ఞ (హ్యాండ్ జెస్చర్) హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముందుగా దానిని ప్రారంభించగా.. ప్రస్తుతం సీఎం విజయ్ ఆ జెస్చర్‌ను వైరల్ చేశారు. ఇప్పుడు ఆ జెస్చరే టీవీకేపై విమర్శలు గుప్పించడానికి ప్రతిపక్ష డీఎంకేకు ఆయుధంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో ఇప్పుడు ఓ చేతి సంజ్ఞ (హ్యాండ్ జెస్చర్) హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముందుగా దానిని ప్రారంభించగా.. ప్రస్తుతం సీఎం విజయ్ ఆ జెస్చర్‌ను వైరల్ చేశారు. ఇప్పుడు ఆ జెస్చరే టీవీకేపై విమర్శలు గుప్పించడానికి ప్రతిపక్ష డీఎంకేకు ఆయుధంగా మారింది. ఈ చేతి సంజ్ఞకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాది మార్చిలో స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతుండగా.. మీడియా ప్రతినిధులు ఆయనను ఆపారు. సీట్ల పంపకాల విషయం ఎంతవరకు వచ్చిందని ఆయనను అడిగారు. ఇందుకు స్టాలిన్ బదులిస్తూ సీట్ల పంపకాల విషయం అయిపోయిందని చేతితో ఒక సైగ చేశారు.
కట్ చేస్తే..
తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. జూన్‌లో అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా.. డీఎంకేపై సీఎం విమర్శలు చేశారు. తర్వాత డీఎంకే నేతలు వాకౌట్ చేశారు. ఒక చేతి సైగ చేయడానికి తనకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను విజయ్ కోరారు. తర్వాత ఆయన స్టాలిన్ తరహాలో ఒక సైగ చేశారు. దాంతో ఆ జెస్చర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అది స్టాలిన్‌కు రిప్లై ఇవ్వడానికి కాదని, సరదా కోసం విజయ్ చేసిన సైగ అని టీవీకే పేర్కొంది. అంతకుముందు స్టాలిన్ ఆ సైగ చేసినపుడు అన్నాడీఎంకే ఆయనను విమర్శించింది. విజయ్ కూడా అలాంటి సైగ చేయడంతో డీఎంకే ఆయనను విమర్శించింది.
బీజేపీకి బీ టీం టీవీకే
విజయ్ సైగపై టీవీకే తీవ్రంగా విమర్శించింది. ఆరెస్సెస్ కార్యకర్తలు భగవద్ ధ్వజానికి చేసే ప్రణామంతో విజయ్ సైగను పోలుస్తూ డీఎంకే నేతలు విమర్శలు చేశారు. తాజాగా బుధవారం ఒక పోస్టర్‌ను డీఎంకే విడుదల చేసింది. అందులో ఒక ఆరెస్సెస్ కార్యకర్త ధ్వజప్రమాణం చేస్తున్న బొమ్మ ఉండగా.. పక్కనే విజయ్ సైగ చేస్తున్నట్లు మరో బొమ్మ ఉంది. అంతేకాకుండా ఆరెస్సెస్‌కు విజయ్ దత్తపుత్రుడు అని, బీజేపీకి టీవీకే బీ టీంగా మారిందని విమర్శలు చేసింది. మరోవైపు టీవీకే నేతలు, అభిమానులు విజయ్ సైగను అదేపనిగా చేస్తున్నారు. పలు పార్టీ ఈవెంట్లలో అదొక ఫ్యాషన్‌గా మారింది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థులు విజయ్ సైగ చేస్తున్న వీడియోను టీవీకే మంత్రి ఇటీవలే పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి