బీఎండబ్ల్యూ కారు ఓనర్‌కు రూ.70 లక్షల పరిహారం
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:38 PM
హైవేలో అర్ధరాత్రి పూట కారు టైర్ పంక్చర్ అయితే? దగ్గర్లో మెకానిక్ కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? రవికాంత్ పాటిల్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. మహారాష్ట్రలోని ధూల్ఖేడ్ సమీపంలో హైవేపై అర్ధరాత్రి పాటిల్ తన బీఎండబ్ల్యూ కారులో వెళ్తుండగా కారు టైర్ పంక్చర్ అయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: హైవేలో అర్ధరాత్రి పూట కారు టైర్ పంక్చర్ అయితే? దగ్గర్లో మెకానిక్ కూడా లేకపోతే ఏంటి పరిస్థితి? రవికాంత్ పాటిల్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. మహారాష్ట్రలోని ధూల్ఖేడ్ సమీపంలో హైవేపై అర్ధరాత్రి పాటిల్ తన బీఎండబ్ల్యూ కారులో వెళ్తుండగా కారు టైర్ పంక్చర్ అయింది. ఆ టైంలో సమీపంలో మెకానిక్ దుకాణాలేవీ లేవు. దీంతో ఆయన తన కారును రోడ్డు పక్కన ఆపి విండోస్ అన్నీ లాక్ చేశారు. మరో వాహనంలో తన ఇంటికి చేరుకున్నారు. తర్వాతి రోజు కారు పార్క్ చేసిన చోటుకు వెళ్లి చూడగా.. పాటిల్‌కు దిమ్మ తిరిగింది. తన కారు పూర్తిగా కాలిబూడిదైన స్థితిలో కనిపించింది. ఈ సంఘటన 2012 మార్చి 8న జరిగింది. దీంతో పరిహారం కోసం ఆయన తన బీమా కంపెనీని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది.
బీమా చెల్లింపునకు నో
రవికాంత్ పాటిల్‌కు పరిహారం చెల్లించడానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించింది. పాటిల్ తన కారును నిర్లక్ష్యంగా హైవేపై రాత్రి వదిలివెళ్లారని, దీంతో పాలసీ నియమాలను ఆయన ఉల్లంఘించారని కంపెనీ వాదించింది. ఈ నేపథ్యంలో బీమా పరిహారం చెల్లించడం కుదరదని తేల్చిచెప్పింది. కారు అలా బూడిద కావడానికి పాటిలే కారణమని పేర్కొంది. దీంతో పాటిల్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. పట్టు వదలకుండా 14 ఏళ్లపాటు కంపెనీపై పోరాడారు. చివరకు పాటిల్‌కు అనుకూలంగా ఫోరం తీర్పు చెప్పింది. కంపెనీ వాదనలను ఫోరం తిరస్కరించింది. దారి మధ్యలో ఆగిపోయిన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపకూడదన్న నియమం ఏదీ పాలసీలో లేదని ఫోరం తెలిపింది. కారు మధ్యలో ఆగిపోయినా.. పాటిల్ దానిని జాగ్రత్తగా రోడ్డు పక్కన ఆపారని, అంతేకాకుండా విండోస్ అన్నీ మూసివేశారని ఫోరం తెలిపింది. ఆయనకు రూ.70 లక్షల పరిహారం చెల్లించాలని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. కాగా.. రూ.70 లక్షల్లో రూ.25 వేలు లిటిగేషన్ చార్జీలు, బాధితుడిని మానసిక వేదనకు గురిచేసినందుకు మరో రూ.50 వేల చార్జీలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి