అత్తమామల వేధింపులతో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య.. సుసైడ్ నోట్ కలకలం!
ABN , Publish Date - Oct 13 , 2026 | 02:49 PM
మహారాష్ట్రలోని పుణెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 33 ఏళ్ల ఓ మహిళా ఐటీ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆస్తుల కోసం భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు భరించలేక తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 33 ఏళ్ల ఓ మహిళా ఐటీ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అదనపు కట్నం, ఆస్తుల కోసం భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులు భరించలేక తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
త్రిష్ణ రాహుల్ సక్పాల్ అనే మహిళకు, రాహుల్ సక్పాల్‌తో 2018లో వివాహం జరిగింది. అయితే పెళ్లై కొన్ని రోజుల నుంచి త్రిష్ణ తీవ్ర మానసిక, శారీరక వేధింపులను ఎదుర్కొన్నట్లు ఆమె తండ్రి బాలకృష్ణ నికమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. త్రిష్ణ సంపాదించే పూర్తి జీతం తమకివ్వాలని, పుట్టింటి వారు ఇచ్చిన ఫ్లాట్‌ను అత్త పేరుపై మార్చాలని ఆమెను వేధించినట్లు సమాచారం. అంతేకాకుండా కోటి రూపాయల విలువైన ఫ్లాట్‌ను మామ కోసం కొనుగోలు చేయాలంటూ భర్త కుటుంబ సభ్యులు త్రిష్ణపై ఒత్తిడి తెచ్చారని ఆమె తండ్రి ఫిర్యాదులో తెలిపారు.
ఈ వేధింపులు భరించలేక త్రిష్ట 2021లో పుట్టింటికి చేరుకున్నారు. మరో వివాహం చేసుకునేందుకు ఆమె భర్త కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఈ వివాదం నడుస్తుండగానే త్రిష్ణ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్ని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు భర్త రాహుల్, అత్త వైశాలి, మామ సంజయ్, మరదలు శైలి కారణమని ఆ లేఖలో పేర్కొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పూణెలో ఇలాంటి కట్నం వేధింపుల ఘటన గత నెలలోనూ ఒకటి చోటుచేసుకోవడం గమనార్హం.
ఇవీ చదవండి:
అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ
రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో విచారణపై స్టే