ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక..
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:31 PM
ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. పార్లమెంట్ ప్రశ్నల సమాధానాలపై ఆంక్షలు విధించింది.
ఢిల్లీ, జులై 6 (ఆంధ్రజ్యోతి): ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) కీలక హెచ్చరిక జారీ చేసింది. పార్లమెంట్ ప్రశ్నల సమాధానాలపై ఆంక్షలు విధించింది. సభలో మంత్రులు సమాధానం ఇచ్చే వరకు ఆ వివరాలు 'అత్యంత గోప్యంగా' ఉంచాలని ఆదేశించింది. ప్రశ్నోత్తరాల సమయం (Question Hour) ముగియకుండా సమాధానాలను బయటకు వెల్లడించొద్దని స్పష్టం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు ఈ నిబంధనలను గుర్తుచేసింది లోక్‌సభ సెక్రటేరియట్. లిఖితపూర్వక సమాధానాలను సభాపతి టేబుల్‌పై ఉంచే వరకు రహస్యంగా ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది.
సభలో మంత్రులు అధికారికంగా సమాధానం చెప్పిన తర్వాతే ఆ వివరాలను మీడియాకు లేదా ప్రజలకు తెలపాలని లోక్‌సభ సెక్రటేరియట్ సూచించింది. సభలో మంత్రులు ఇచ్చే సమాధానాల తుది రూపమే రికార్డుల్లోకి వెళ్తుందని గుర్తుచేసింది. గతంలో కొందరు ఎంపీలు సమాధానాలను ముందే మీడియాకు, సోషల్ మీడియాలో పంచుకోవడంపై సెక్రటేరియట్ సీరియస్ అయింది. లోక్‌సభలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు, రాజ్యసభలో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ప్రశ్నోత్తరాల సమయాన్ని కేటాయించింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసేలోపు ఎలాంటి సమాధానాలను లీక్ చేసినా నిబంధనల ఉల్లంఘనే అవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్ హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News