కేరళలో అతివేగంగా కారు నడిపి ముగ్గురిని బలిగొన్న యువకుడు
ABN , Publish Date - Oct 12 , 2026 | 09:48 PM
గంటకు 220 కిలోమీటర్ల వేగంతో మినీ కూపర్ కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీశాడు ఓ యువకుడు. ఈ ఘటన కేరళలోని కొచ్చి-ఎర్నాకుళం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: గంటకు 220 కిలోమీటర్ల వేగంతో మినీ కూపర్ కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీశాడు ఓ యువకుడు. ఈ ఘటన కేరళలోని కొచ్చి-ఎర్నాకుళం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుహైల్ సజీవ్(19) అనే యువకుడు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నాడు. కారు ఎర్నాకుళం జిల్లా నెడుంబస్సేరి సమీపంలోకి రాగా.. అదే సమయంలో స్కూటర్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. దీంతో కారు ఒక్కసారిగా స్కూటర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. అంతేకాకుండా స్కూటర్‌ను 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో యువకుడు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
మృతులను దేవిక(21), గోపిక(22), ఇజాజ్(21)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురూ విమానాశ్రయం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోలీసులు సుహైల్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో అతను మద్యం సేవించి కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా.. సుహైల్‌కు మినీ కూపర్ కారు అంటే చాలా ఇష్టమని, అతడి కోరికను నెరవేర్చేందుకే ఆ కారును కొనిచ్చానని అతడి తల్లి ఓ వీడియోలో చెప్పారు. తన పుట్టినరోజు డిసెంబర్‌లో ఉందని, ఆ సమయంలోనే తన కుమారుడికి కారు కొనాలని మొదట అనుకున్నానని ఆమె తెలిపారు. అయితే, చివరకు తన కొడుకుకు ఆ కారును బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు, సుహైల్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నట్లు కనిపించే వీడియోలను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
తిరువళ్లువర్‌కు కాషాయ రంగు.. బీజేపీపై టీవీకే సెటైర్లు..
హిట్ అండ్ రన్ కేసులో రూ.2 లక్షల పరిహారం.. పొందే మార్గమిదే!