మాజీ ప్రియురాలిని హత్య చేసి దహనం చేసిన యువకుడు!
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:11 PM
కేరళలో దారుణం చోటుచేసుకుంది. తన మాజీ ప్రియురాలిని ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతు నులిమి, రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో దారుణం చోటుచేసుకుంది. తన మాజీ ప్రియురాలిని ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. గొంతు నులిమి, రాయితో కొట్టి.. దారుణంగా చంపేశాడు. అనంతరం, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడులోని బోడిన ప్రాంతానికి చెందిన నిత్య (18), రాజకుమారి ప్రాంతానికి చెందిన నిశాంత్ (19) 2023 నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. కొద్ది రోజుల క్రితం నిశాంత్ నిత్యకు ఫోన్ చేసి మాట్లాడాలని, పూపాడ ప్రాంతానికి రావాలని కోరాడు. అతడి మాటలు నమ్మి పూపాడలోని ఒక తేయాకు తోటకు నిత్య వెళ్లింది.
ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్న తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కాస్తా వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నిశాంత్.. నిత్యను గొంతు నులిమి అనంతరం బండరాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా పోలీసులు దొరక్కుండా ఉండేదుకు మృతదేహాన్ని తన ఆటోరిక్షాలో ఎక్కించుకుని పాంబ్లా డ్యామ్ ప్రాంతానికి తరలించాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను మృతదేహంపై పోసి నిప్పుంటించాడు.
మరుసటి రోజు డ్యామ్ సమీపంలో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హత్య అనంతరం నిందితుడు నిశాంత్ తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలించిన పోలీసులు రాజకుమారి ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే
ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో
సింగరేణి కార్మికులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్