సింగరేణి కార్మికులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:27 PM
సింగరేణి సంస్థపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విరుచుకుపడ్డారు.
జగిత్యాల, అక్టోబర్16: సింగరేణి సంస్థపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులు చనిపోతే కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. మీ ప్రభుత్వ హయాంలో ఒక్క సింగరేణి గనిని అయినా పరిశీలించారా? అంటూ ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. సింగరేణికి గడ్డం పెంచుకుని వస్తే లాభం ఏమిటీ అని కేటీఆర్ను ఆయన నిలదీశారు.
కేసీఆర్ను జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి తిట్టినట్లు ఎవరూ తిట్టలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని గతంలో జీవన్ రెడ్డి ఆరోపించ లేదా? అని గుర్తు చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను జీవన్ రెడ్డి దెయ్యం, భూతం అని అభివర్ణించారని వివరించారు. ఇక హోం మంత్రిని కేసీఆర్ గేటు బయటే ఆపేశారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలను తమ సీఎం రేవంత్ రెడ్డి విమానంలో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఇదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే
ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో
For More TG News And Telugu News