Share News

ఏపీకి పిడుగుపాటు హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:57 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

ఏపీకి పిడుగుపాటు హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
weather alert in ap

అమరావతి, అక్టోబర్ 16: రాష్ట్రంలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.


రాష్ట్రంలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీనితోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో

For More AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 04:10 PM